Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Awards 2022: ఈ ఏడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్‌గా నామినేట్ అయిన క్రికెటర్స్ వీళ్లే.. లిస్టులో మనోడు కూడా ఉన్నాడండోయ్..

ICC అవార్డ్స్ 2022: ఐసీపీ ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు అనేది 26 ఏళ్లలోపు ఆటగాళ్లకు మాత్రమే ఇచ్చేది. ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డులను 2022 సంవత్సరంలో ఇవ్వనుంది ఐసీసీ. ఈ మేరకు ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డ్ 2022 కోసం నామినీల జాబితాను ఐసీసీ ప్రకటించింది.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 29, 2022 | 3:01 PM

 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రతి ఏటా ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు కోసం 26 సంవత్సరాల లోపు వయసున్న ఆటగాళ్లను నామినేట్ చేస్తుంది. అదే మాదిరిగానే ఈ ఏడాది కూడా అవార్డు కోసం నామినీ జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ జాబితాలో మొత్తం నలుగురు ఆటగాళ్లు చోటు సంపాదించుకోగా.. వారిలో ఒకరు భారత క్రికెటర్. ఐసీసీ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

1 / 6
మార్కో జాన్సన్: దక్షిణాఫ్రికా యువ లెఫ్టార్మ్ పేసర్ ఈ ఏడాది 9 టెస్టులు, 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్‌లు ఆడి వాటిలో మొత్తం 40 వికెట్లు తీశాడు. ఇంతటి అద్భుతమైన ప్రదర్శన ఫలితంగా మార్కో జాన్సన్(22 ) ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.

2 / 6
ఇబ్రహీం జద్రాన్: ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్(21) 4 టెస్టు మ్యాచ్‌ల్లో 356 పరుగులు, 8 వన్డే మ్యాచ్‌ల్లో 431 పరుగులు చేశాడు. 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను మొత్తం 381 పరుగులు చేశాడు. ఫలితంగా  ఐసీపీ ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు  కోసం నామినేట్ అయ్యాడు.

3 / 6
ఫిన్ అలెన్: న్యూజిలాండ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఫిన్ అలెన్( 23) ఈ ఏడాది 11 వన్డే మ్యాచ్‌ల్లో 387 పరుగులు, 25 టీ20 మ్యాచ్‌ల్లో 567 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన ఫలితంగా ICC ఎమర్జింగ్ అవార్డుకు  ఫిన్ అలెన్ ఎంపికయ్యాడు.

4 / 6
అర్షదీప్ సింగ్: ఈ ఏడాది టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసిన 23 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 2022లో కెరీర్ ప్రారంభించిన అర్షదీప్ 21 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 33 వికెట్లు తీశాడు. అలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అతను ఇప్పుడు ICC ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.

5 / 6
ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు కోసం 26 ఏళ్ల లోపు ఆటగాళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ఈసారి ఫిన్ అలెన్, అర్ష్‌దీప్ సింగ్, ఇబ్రహీం జద్రాన్, మార్కో జాన్సన్ చివరి రౌండ్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఎవరు ఈసారి అత్యుత్తమ యువ క్రికెటర్‌గా నిలుస్తారనేది తెలుసుకోవడాని మరి కొన్ని రోజులు వేచి చూడాలి.

6 / 6
Follow us