Peanut Butter Benefits: డయాబెటీస్ ఉంటే పీనట్ బటర్ తినొచ్చా? దీని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..

చాలా మంది డైటీషియన్లు ఈ మధ్య కాలంలో పీనట్ బటర్ తినమని సిఫార్సు చేస్తున్నారు. ఇందులో మోనోశాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

Peanut Butter Benefits: డయాబెటీస్ ఉంటే పీనట్ బటర్ తినొచ్చా?  దీని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..
Penut Butter

Edited By:

Updated on: Mar 06, 2023 | 12:39 PM

చాలా మంది డైటీషియన్లు ఈ మధ్య కాలంలో పీనట్ బటర్ తినమని సిఫార్సు చేస్తున్నారు. ఇందులో మోనోశాచురేటెడ్ , పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. అదనంగా, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B3, విటమిన్ B6, ఫోలేట్, మెగ్నీషియం, కాపర్ , మాంగనీస్ పీనట్ బటర్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇది కాకుండా, విటమిన్ B5, ఐరన్, పొటాషియం, జింక్, సెలీనియం కూడా ఇందులో ఉంటాయి. ఈ పోషకాలు బరువు తగ్గడానికి, గుండె జబ్బులు, మధుమేహంతో పోరాడటానికి సహాయపడతాయి. మీరు దీన్ని ఉదయం, సాయంత్రం అల్పాహారంలో తినవచ్చు.

పీనట్ బటర్ ప్రయోజనాలు:

  1. పీనట్ బటర్ గుండెకు మేలు చేస్తుంది: పి-కౌమారిక్ యాసిడ్ పీనట్ బటర్ లో ఉంటుంది, ఇది గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  2. బ్లడ్ షుగర్ తగ్గించడంలో సహాయపడుతుంది: పీనట్ బటర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వారానికి 5 రోజులు 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ తింటే, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 30 శాతం తగ్గుతుంది.
  3. బాడీ బిల్డింగ్‌లో ఉపయోగపడుతుంది: ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బాడీబిల్డింగ్ చేసే యువకులు పీనట్ బటర్ మంచి ఆహారం. అలాగే ఇందులో పీచుపదార్థం ఉండటం వల్ల పొట్ట సమస్యల నుంచి కూడా దూరం చేసి శరీరానికి పోషణనిస్తుంది.
  4. ఎముకలు దృఢంగా తయారవుతాయి: పీనట్ బటర్ లో ఐరన్ , కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.: ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ లో 100 కేలరీలు ఉంటాయి. అదనంగా, ఇందులో ప్రోటీన్ , ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు మీ పొట్ట నిండుగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయదు.

మీరు మార్కెట్ నుండి పీనట్ బటర్ ని కొనుగోలు చేస్తుంటే, ప్యాకెట్‌పై షుగర్ మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మార్కెట్లో అనేక రకాల పీనట్ బటర్ లు అందుబాటులో ఉంటాయి.

ఒక రోజులో పీనట్ బటర్ ఎంత తినాలి:

మీరు ఒక రోజులో 1 లేదా 2 స్పూన్ల పీనట్ బటర్ ని తినవచ్చు ఎందుకంటే అధిక వినియోగం మీ ఊబకాయాన్ని పెంచుతుంది. తక్కువ పరిమాణంలో మాత్రమే తినండి.ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, ఖచ్చితంగా మీ డాక్టర్ ను సంప్రదించండి.

పీనట్ బటర్ ఎలా తినాలి:

1. మీరు దీన్ని బ్రెడ్ లేదా రోటీతో అప్లై చేసి కూడా తినవచ్చు.
2. అరటి పండు షేక్, మరేదైనా మిల్క్ షేక్‌తో కూడా తినవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..