
చాలా మంది తరచుగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యని తేలికగా తీసుకోకూడదు. నిరంతర తలనొప్పి మైగ్రేన్ లేదా అధిక రక్తపోటు వంటి తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో బాబా రామ్‌దేవ్ సూచించిన కొన్ని సాధారణ యోగా ఆసనాలు తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ ఆసనాలు తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాదు మనస్సును ప్రశాంతపరుస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ యోగా ఆసనాలను ప్రతిరోజూ చేయడం వల్ల శక్తిని నిర్వహించడంతో పాటు.. దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని పెంచుతుంది.
తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో అత్యంత సాధారణమైనవి ఒత్తిడి, నిద్ర లేకపోవడం. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ ఉండటం, కళ్ళు ఒత్తిడికి గురికావడం , కంటిలో నీరు లేకపోవడం కూడా తలనొప్పికి దోహదం చేస్తాయి. ఇంకా అధిక కెఫిన్ లేదా జంక్ ఫుడ్ వినియోగం, బిగ్గరగా శబ్దాలు లేదా ప్రకాశవంతమైన కాంతికి గురికావడం, మెడ , భుజాలు బిగుసుకుపోవడం లేదా తప్పు భంగిమల్లో కూర్చోవడం కూడా తలనొప్పికి కారణమవుతాయి. వాతావరణ మార్పులు, హార్మోన్ల అసమతుల్యత , రక్తపోటు సమస్యలు కూడా తలనొప్పికి కారణమవుతాయి. కనుక తల నొప్పి నుంచి ఈ ఆసనాలు ఉపశమనం ఇస్తాయి.
భ్రమరి
భ్రమరి తలనొప్పి , మైగ్రేన్‌ల సమస్య ల నుంచి ఉపశమనం ఇస్తుందని రామ్ దేవ్ చ్శ్హరు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందనిఅన్నారు. దీనిని సాధన చేస్తున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని తేనెటీగ లాంటి సందడి శబ్దం చేయండి. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
అనులోమ-విలోమ
అనులోమ-విలోమ లేదా నాడి శోధన ప్రాణాయామం శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది అలసట, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
శీతలి ప్రాణాయామం
ఈ టెక్నిక్‌లో నాలుకను ఒక గొట్టంలోకి గుండ్రంగా చేసి.. నోటి ద్వారా గాలి పీల్చి, ముక్కు ద్వారా గాలిని వదలడం ద్వారా శ్వాస తీసుకుంటారు. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. కోపం , ఒత్తిడిని తగ్గిస్తుంది.
శీత్కారి ప్రాణాయామం
దీని అర్థం దంతాల ద్వారా గాలిని లోపలికి తీసుకుని.. కొద్దిగా తెరిచి, ముక్కు ద్వారా బయటకు వదిలేయడం. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. మనస్సుకు విశ్రాంతినిస్తుంది.
ఈ ఆసనాలను ఉదయం ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం ప్రశాంత వాతావరణంలో సాధన చేయడం ఉత్తమం. 5-10 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా తలనొప్పిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..