Backache: ఇంటి నుంచి పని చేయడం చాలా మందికి సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఊబకాయం, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకానికి దారి తీస్తుంది. ఇవే కాకుండా చాలామంది వెన్నునొప్పి సమస్యని ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. దీనివల్ల చాలామంది బాధపడుతున్నారు. దీనిని నివారించడానికి ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. నిద్రపోయేటప్పుడు తల కింద దిండును ఉపయోగించవద్దు.
2. మకరాసనం (మొసలి భంగిమ), శలభాసనం (మిడతల భంగిమ), మర్కటాసనం (వెన్నెముక తిప్పడం), భుజంగనాసనం (కోబ్రా భంగిమ) వంటి సాధారణ ఆసనాలను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలి.
3. రెండు గంటలకు మించి ఒకే భంగిమలో కూర్చోవద్దు. ఐదు నిమిషాల విరామం తీసుకోవాలి.
4. ఆవాలు లేదా నువ్వుల నూనెతో వీపుపై మసాజ్ చేయించుకోవాలి. ఇలా చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుంది.
5. మీ వెన్నునొప్పి నరాల కుదింపు లేదా దీర్ఘకాలికంగా ఉంటే ఈ చిట్కాలతో పాటు ఆయుర్వేద మందులు నొప్పిని తగ్గించడంలో సమర్దవంతంగా పనిచేస్తాయి.
6. సరైన పద్దతిలో కూర్చోకపోవడం వల్ల వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి సరైన భంగిమలలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.
7. వెన్నునొప్పిని తగ్గించే ఆహారాలు కూడా తీసుకోవాలి. ట్యూనా చేపలో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని ఇతర నొప్పి, మంటను తగ్గిస్తుంది. సాల్మాన్ చేప.. ఇందులో కూడా అనేక రకాల పోషక విటమిన్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఉండడం వలన నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీనికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది.