Yoga for Healthy Pregnancy: గర్భం దాల్చిన మహిళలు రోజూ ఈ ఆసనాలు చేస్తే.. మీ బిడ్డ ఆరోగ్యం మరింత పదిలం

|

Oct 17, 2024 | 8:59 PM

నేటి కాలంలో మహిళలు గర్భం దాల్చడంలో తీవ్ర ఉబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు జీవనశైలి ప్రధాన కారణం అయినప్పటికీ ఈ కింది ముఖ్యమైన యోగాసనాలు రోజూ వేయడం వల్ల ఆరోగ్యవంతంగా గర్భం ధరించవచ్చు. అంతేకాదు మీ పాపాయి ఆరోగ్యం కూడా మరింత పదిలంగా ఉంటుంది..

Yoga for Healthy Pregnancy: గర్భం దాల్చిన మహిళలు రోజూ ఈ ఆసనాలు చేస్తే.. మీ బిడ్డ ఆరోగ్యం మరింత పదిలం
Yoga For Healthy Pregnancy
Follow us on

ఆరోగ్యకరమైన గర్భం కోసం అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటం ఎంత ముఖ్యంగా గర్భం దాల్చగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో స్త్రీలలో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి గర్భం దాల్చాలనుకుంటున్న మహిళలు తమ దినచర్యలో యోగా చేయడం ప్రారంభించాలి. ఇది తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బద్ద కోనాసనం

ఇది మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ యోగాసనం చేయడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా ఋతు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. గర్భధారణకు సహాయపడుతుంది. హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. సంతానోత్పత్తిని పెంచుకోవడానికి ఇది మంచి యోగాసనమని, గర్భం దాల్చాలనుకునే వారు దీన్ని రోజూ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గర్భధారణ సమయంలో చేసే ఈ యోగాసనం బలహీనత, అలసటను నివారిస్తుంది. ప్రసవాన్ని సులభతరం చేస్తుంది.

మలసానాసనం

గర్భం పొందాలనుకునే వారు ముందుగా మీ దినచర్యలో మలసానా చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ యోగాసనం చేయడం వల్ల గర్భాశయానికి సంబంధించిన సమస్యలు తగ్గి, పెల్విక్ రీజియన్ అంటే పొట్ట కింది భాగం బలపడుతుంది. గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యలను అధిగమించడానికి ఈ యోగాసనం ఉపయోగపడుతుంది. సీరియడ్స్‌ సమయంలో కూడా ఈ ఆసనం వేయవచ్చు.

ఇవి కూడా చదవండి

అర్ధ హలాసనం (సగం నాగలి భంగిమ)

గర్భం పొందాలనుకునే వారు తమ దినచర్యలో అర్ధ హలాసనం చేయవచ్చు. ఈ ఆసనం చేయడం వల్ల ఎగ్‌ నాణ్యత మెరుగుపడుతుంది. అండోత్సర్గము సులభతరం అవుతుంది. ఈ ఆసనం పెల్విక్, బ్యాక్ కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే, ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

వీర భద్రాసనం

గర్భం దాల్చే మహిళలు యోధుల భంగిమ లేదా వీరభద్రాసనం చేయాలి. ఈ యోగా శరీర ప్రధాన కండరాలను బలపరుస్తుంది. ఉదర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో, సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని రోజూ చేయడం వల్ల మెదడుకు కూడా మేలు జరుగుతుంది. ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.