
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనేక తీవ్రమైన, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, విశ్రాంతి లేని జీవితంతో చిన్న వయసులోనే ఎక్కువగా బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యంగా ఉండేందుకు మంచి అలవాట్ల వైపు అడుగులు వేస్తున్నారు. చాలామంది ఆరోగ్యంగా ఉండేందుకు ఆహార పదార్థాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటుగా వ్యాయామాలు, యోగాసనాలు వంటివి కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నారు. ఈ సూర్య నమస్కారాలు స్త్రీలు చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ముఖ్యంగా స్త్రీలు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం పూట స్త్రీలు సూర్య నమస్కారం చేస్తే పురుషుల కంటే ఎక్కువ లాభాలు పొందుతారట.. రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మహిళలు సూర్య నమస్కారాలు చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని చెబుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఉదయాన్నే సూర్యనమస్కారం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారు కూడా ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల తొందరగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉదయాన్నే స్త్రీలు సూర్య నమస్కారం చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వయసు పైబడిన లక్షణాలు కనిపించకుండా చేస్తుంది. యవ్వనం మరింత పెరుగుతుంది.. కొంతమంది మహిళల్లో రోజు ఉదయం పూట సూర్య నమస్కారం చేస్తే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..