Winter Skin Care Tips: చలికాలంలో చర్మం ఎందుకు దురద పెడుతుందో తెలుసా? ఈ తప్పులు మీరూ చేయకండి..

చలికాలంలో చర్మం, జుట్టు త్వరగా డ్యామేజ్‌ అవుతుంది. ఈ చలికాలంలో చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడుతుంది. జుట్టు పొడిగా మారి, డల్ అవుతుంది. అంతేకాకుండా చల్లటి గాలి సోకినప్పుడు చర్మం దురదగా అనిపిస్తుంది. చల్లటి గాలి, తక్కువ తేమ, వేడి జల్లులు, మందపాటి దుస్తులు దరించడం.. ఈ కారణాల వల్ల చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. చలికాలంలో ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలంటే..

Winter Skin Care Tips: చలికాలంలో చర్మం ఎందుకు దురద పెడుతుందో తెలుసా? ఈ తప్పులు మీరూ చేయకండి..
Winter Skin Care

Updated on: Oct 22, 2023 | 10:00 PM

చలికాలంలో చర్మం, జుట్టు త్వరగా డ్యామేజ్‌ అవుతుంది. ఈ చలికాలంలో చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడుతుంది. జుట్టు పొడిగా మారి, డల్ అవుతుంది. అంతేకాకుండా చల్లటి గాలి సోకినప్పుడు చర్మం దురదగా అనిపిస్తుంది. చల్లటి గాలి, తక్కువ తేమ, వేడి జల్లులు, మందపాటి దుస్తులు దరించడం.. ఈ కారణాల వల్ల చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. చలికాలంలో ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలంటే..

చలికాలంలో చర్మం దురద ఎందుకు వస్తుందంటే..

తక్కువ తేమ

శీతాకాలంలో గాలి సాధారణంగా పొడిగా ఉంటుంది. ఇది చర్మంలో తేమ స్థాయిని తగ్గిస్తుంది. దీంతో తేమ లేకపోవడం వల్ల చర్మం పొడిగా మారి, దురద పెడుతుంది. బదులుగా ఈ కాలంలో అధికంగా నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు.

వేడి నీటి స్నానం

చలికాలంలో వేడి నీటి స్నానం శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇది చర్మంలోని సహజమైన ఆయిల్ కంటెంట్‌ను నాశనం చేస్తుంది. ఫలితంగా చర్మం పొడిబారడాన్ని పెంచుతుంది. దీంతో చర్మంపై దురద, పొలుసు మాదిరి ఏర్పడటం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మందపాటి దుస్తులు

చలికాలంలో స్వెటర్లు, శాలువాలు, మందపాటి బట్టలు ధరించడం సర్వసాధారణం. ఈ బిగుతు దుస్తులను ధరించడం వల్ల చర్మంపై రాపిడి ఏర్పడి చికాకు కలుగుతుంది. ఇది దురదను కలిగిస్తుంది.

రసాయనాలు కలిగిన చర్మ ఉత్పత్తులు వినియోగించడం

రసాయనాలు కలిగిన సబ్బులు లేదా చర్మ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. ఇది పొడి, దురదను కలిగిస్తుంది.

చలికాలంలో చర్మం దురదను ఎలా నివారించాలంటే..

మాయిశ్చరైజర్

శీతాకాలంలో చర్మ దురదను నివారించాలంటే చర్మంను తేమగా ఉంచడం ఒక్కటే మార్గం. స్నానం చేసిన తర్వాత రోజంతా మందపాటి, హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురోనిక్ యాసిడ్, షియా బటర్ లేదా సిరమైడ్‌లు వంటి పదార్థాలు ఉన్న ఉత్పత్తులను వినియోగించాలి.

గోరువెచ్చని నీళ్లతో స్నానం

వేడి నీటి స్నానానికి బదులుగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఇది చర్మం సహజ నూనెలను నిలుపుకోవడంలో, అధిక పొడిని నివారించడంలో సహాయపడుతుంది.

గాఢత తక్కువగా ఉండే చర్మ ఉత్పత్తులు

స్నానం చెయ్యడానికి సున్నితమైన, సువాసన లేని క్లెన్సర్‌ని ఉపయోగింయాలి. కఠినమైన, ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులను వినియోగించడం నివారించాలి.

సరైన దుస్తులను ఎంచుకోవాలి

చర్మంపై రాపిడి,చికాకును తగ్గించడానికి కాటన్‌ వంటి మృదువైన, తేలికైన బట్టలను ఎంచుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.