
చలికాలం మొదలైంది..అప్పుడే చలి చంపేస్తోంది. అయితే, సాధారణంగానే డయాబెటిక్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ సీజనల్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లు తాగాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు..చలికాలంలో పండ్లు ఎక్కువైతే గ్లూకోజ్ పెరుగుతుంది. పరిమితి పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు హెవీ ఫుడ్ తీసుకోవటం మానేయాలని చెబుతున్నారు. తప్పనిసరిగా ప్రతి రోజూ 20 నుంచి30 నిమిషాలు వాకింగ్ చేయాలని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..