
అరటిపండు, బొప్పాయి ఈ రెండు రకాల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆరోగ్య నిపుణులు కూడా ఈ రెండు పండ్లను ఎక్కువగా తినాలని చెబుతుంటారు. అంతేకాకుండా ఈ రెండూ పండ్లు అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ పండ్లు వేర్వేరుగా తినాలి. అదే కలిపి తిన్నారో మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరటిపండ్లతో బొప్పాయి తినడం ఎందుకు మంచిదికాదో ఇక్కడ తెలుసుకుందాం..
అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఈ పండులో మనకు అవసరమైన పొటాషియం, కాల్షియం లభిస్తాయి. ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, ఆ రెండు పండ్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి. కానీ అరటిపండ్లు, బొప్పాయి వేర్వేరు లక్షణాలు కలిగిన పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు అంటున్నారు. అంతే కాదు వీటిని కలిపి తినడం వల్ల వాంతులు, అలెర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయట. ముక్యంగా శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అరటితో కనిపి తినకుండా ఉండటమే మంచిదని అంటున్నారు.
అరటిపండ్లు, బొప్పాయి కలిపి తినడం వల్ల కొంతమందిలో ఉబ్బరం, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అందుకే ఈ పండ్ల కలయిక మంచిది కాదు. బదులుగా, సమస్యలు తీవ్రం కాకుండా నిరోధించడానికి వేర్వేరు సమయాల్లో వాటిని తీసుకోవడం మంచిది. అయతే బొప్పాయి, అరటి పండ్లను విడివిడిగా తినడం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం అరటిపండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. బొప్పాయిలు శరీరాన్ని వేడి చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. తలనొప్పి, వాంతులు, తలతిరగడం, అలెర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రెండు పండ్ల కలయికను వీలైనంత వరకు తగ్గించడం బెటర్. తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.