రోజూ రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలల్లో ఇది ఓ స్పూన్‌ కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం సహజం. ఈ సమయంలో శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా, బలంగా ఉంచడానికి ఆయుర్వేదంలో ఓ చిట్కా ఉంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఓ స్పూన్‌ చ్యవన్‌ప్రాష్ కలపాలి. చ్యవన్‌ప్రాష్ అనేది ఉసిరి, తేనె, నెయ్యి వంటి 40 కి పైగా మూలికల మిశ్రమం. ఇది వేల ఏళ్లుగా మన పూర్వికుల కాలం నుంచి..

రోజూ రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలల్లో ఇది ఓ స్పూన్‌ కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
Chyawanprash

Updated on: Nov 16, 2025 | 1:22 PM

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం సహజం. ఈ సమయంలో శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా, బలంగా ఉంచడానికి ఆయుర్వేదంలో ఓ చిట్కా ఉంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఓ స్పూన్‌ చ్యవన్‌ప్రాష్ కలపాలి. చ్యవన్‌ప్రాష్ అనేది ఉసిరి, తేనె, నెయ్యి వంటి 40 కి పైగా మూలికల మిశ్రమం. ఇది వేల ఏళ్లుగా మన పూర్వికుల కాలం నుంచి ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఈ డ్రింక్‌ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు.

రోగనిరోధకశక్తి

ఆయుర్వేదం ప్రకారం గోరు వెచ్చని పాలతో చ్యవన్‌ప్రాష్ తీసుకుంటే రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. చ్యవన్‌ప్రాష్‌లో ప్రధాన పదార్ధం ఉసిరి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట ఆ డ్రింక్‌ తీసుకుంటే ఇందులోని పోషకాలను రాత్రంతా శరీరం గ్రహిస్తుంది. శీతాకాలంలో వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ఇది శరీర సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. ఈ డ్రింక్‌ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి శీతాకాలపు సమస్యలకు దూరంగా ఉంటారు.

నిద్ర

గోరువెచ్చని పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్, సెరోటోనిన్ విడుదలకు సహాయపడుతుంది. చ్యవన్‌ప్రాష్‌లోని మూలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఈ మిశ్రమం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఫలితంగా త్వరగా, ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది. మంచి రాత్రి నిద్ర మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా, శక్తివంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ, పోషకాల శోషణ

చ్యవన్‌ప్రాష్‌లో ఉండే రావి వంటి కొన్ని మూలికలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గోరువెచ్చని పాలు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి. రాత్రిపూట దీనిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. దీన్ని తీసుకుంటే ఆహారం నుంచి పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో చాలా మంది ఆహారం కాస్త ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ మిశ్రమం మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఒంటికి శక్తి

చ్యవనప్రాష్ శరీర కణజాలాలను పోషించి, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నిజానికి రాత్రి నిద్రలో మన శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. ఈ సమయంలో చ్యవనప్రాష్ ఈ మరమ్మత్తు ప్రక్రియకు మరింత మద్దతు ఇస్తుంది. ఇది బలహీనత, అలసటను తొలగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు మరింత పోషకాలను అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం చవన్ ప్రాష్ ను గోరువెచ్చని పాలలో కలిపి శీతాకాలంలో రోజూ రాత్రి పూట తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, మంచి గాఢమైన నిద్రను కూడా అందిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.