ఎడమ చేతికే వాచ్‌ ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు సీక్రెట్‌ ఇదే..

కరిగిపోయిన కాలం తిరిగి రాదు. అందుకే సమయం ఆదా చేసుకోవడానికి అనవసర పనులను వీలైనంత త్వరగా ముగించుకుని, మిగిలిన సమయాన్ని జీవితానికి ఉపయోగపడే పనులకు వాడుకోవాలి. అయితే సాధారణంగా టైం చూడటానికి చాలా మంది చేతికి వాచ్‌ ధరిస్తారు. కొంతమంది టైం కోసమేకాకుండా ఫ్యాషన్‌ కోసం కూడా ధరిస్తారు...

ఎడమ చేతికే వాచ్‌ ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు సీక్రెట్‌ ఇదే..
Why Is Watch Worn On Left Wrist

Updated on: Jul 16, 2025 | 1:25 PM

‘కోల్పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. సమయం చాలా విలువైనది..’ అని పెద్దలు చెబుతుంటారు. సమయం ఆదా చేసుకోవడానికి అనవసర పనులను వీలైనంత త్వరగా ముగించుకుని, మిగిలిన సమయాన్ని జీవితానికి ఉపయోగపడే పనులకు వాడుకోవాలి. అయితే సాధారణంగా టైం చూడటానికి చాలా మంది చేతికి వాచ్‌ ధరిస్తారు. కొంతమంది టైం కోసమేకాకుండా ఫ్యాషన్‌ కోసం కూడా ధరిస్తారు. ఫ్యాషన్ కోసం గడియారం ధరిస్తున్నప్పటికీ.. ప్రతి ఒక్కరూ వీటిని ఎడమ చేతికే ధరిస్తారు మనం ఎడమ చేతిలో మాత్రమే గడియారం ఎందుకు ధరిస్తామో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే..

కొంతమంది కుడి చేతికి గడియారాలు ధరిస్తే.. చాలా మంది తమ ఎడమ చేతికి గడియారాలు ధరిస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అదేంటంటే… మనలో చాలా మందికి కుడి చేతి వాటం ఉంటుంది. అంటే ఎక్కువగా పనులకు కుడి చేతిని ఉపయోగించేవారు ఉంటారు. కుడి చేయి ఎక్కువ బిజీగా ఉంటుంది. కాబట్టి ఎడమ చేతిలో గడియారం ధరించడం వల్ల పనులకు అంతరాయం కలగకుండా ఉంటుంది. అంతే కాదు ఇది వాచ్‌ పాడైపోకుండా కూడా సురక్షితంగా ఉంచుతుంది. ఫలితంగా అది డ్యామేజ్‌ అయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఉదాహరణకు మీరు రాయడం, టైప్ చేయడం వంటి అన్ని పనులు చేయడానికి కుడి చేతిని ఉపయోగించినప్పుడు, ఎడమ చేతిలో గడియారం ధరించడం వల్ల సమయం చూడటం సులభం అవుతుంది. పైగా మీ పనికి అది ఆటంకం కలిగించదు.

మరో శాస్త్రీయ కారణం ఏమిటంటే.. గోడపై వేలాడుతున్న గడియారంలోని 12 సంఖ్య పైకి ఉంటుంది. అదేవిధంగా ఎడమ చేతికి వాచ్‌ ధరించినా 12 సంఖ్య పైకే ఉంటుంది. అదే మీరు కుడి చేతికి వాచ్‌ ధరిస్తే, సంఖ్యల క్రమం తారుమారు అవుతుంది. దీంతో వాచ్‌లో టైంలో చూడటం కష్టమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.