Health Tips: ఒకప్పుడు తెల్ల జుట్టు ముసలితనంలో వచ్చేది. కానీ నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి యువకుల వరకు అందరికి జుట్టు తెల్లగా మారుతుంది. వృద్ధాప్యంలో జుట్టును నల్లగా చేయడానికి కలర్స్‌ని ఉపయోగించవచ్చు కానీ పిల్లల విషయంలో ఏం చేస్తారు. తెల్ల జుట్టు లుక్‌ను పాడుచేయడమే కాదు వాటిని మళ్లీ నల్లగా మార్చడం తలకు మించిన భారం.కానీ కాలక్రమేణా జుట్టు తెల్లగా మారడాన్ని ఖచ్చితంగా నివారించవచ్చు. చిన్న వయస్సులోనే జుట్టు నెరవడానికి కారణం వాటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం.
పిల్లలలో తెల్ల జుట్టు రావడానికి కారణాలు
1. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోవడం.
2. శరీరంలో పోషకాలు లేకపోవడం
3. విటమిన్ బి లోపం
4. ఏదైనా శస్త్రచికిత్స జరగడం లేదా మందులు వాడటం
5. సరిగా నిద్ర లేకపోవడం
6. స్టడీస్ లేదా మరేదైనా ఒత్తిడి
7. వారసత్వం వల్ల
జుట్టు తెల్లబడకుండా ఎలా ఆపాలి
1. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మొదలైతే ప్రారంభంలోనే దానిని నియంత్రించడం అవసరం. లేదంటే ఈ సమస్య వేగంగా పెరుగుతుంది. దీని కోసం ఉసిరిని పిల్లల ఆహారంలో చేర్చండి. ఉసిరి జుట్టు, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు వీటిని చట్నీ లేదా ఊరగాయ రూపంలో అందించాలి.
2. కొబ్బరి నూనెలో ఉసిరి వేసి బాగా ఉడికించాలి. చల్లబడిన తర్వాత ఒక బాక్స్‌లో నింపుకోవాలి. రోజూ ఈ నూనెతో పిల్లల తలకు మసాజ్ చేయాలి. రోజు సాధ్యం కాకపోతే ఒక రోజు మినహా ఒకరోజు చేయాలి.
3. పెరుగులో తురిమిన టమోటాని కలపాలి. అందులో నిమ్మకాయ పిండాలి. ఈ పేస్ట్‌ని మీ పిల్లల జుట్టుకు బాగా అప్లై చేసి సుమారు గంట తర్వాత కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. ఇది జుట్టును పోషిస్తుంది మెరుగ్గా చేస్తుంది.
4. పొడి ఉసిరి, షికకాయిని ఐరన్ పాత్రలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం దానిని రుబ్బితే పూర్తిగా నలుపు రంగు పేస్ట్‌గా మారుతుంది. దీన్ని పిల్లల జుట్టుకు అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. కొంత సమయం తర్వాత జుట్టును కడగాలి. దీనివల్ల జుట్టు నెరవడం ఆగిపోతుంది తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
గుర్తుంచుకోండి
ఈ చర్యలు కాకుండా పిల్లలకు ఆకు కూరలు, ప్రతిరోజూ ఒక పండు తినిపించండి. పప్పులు, మొలకలను వారి ఆహారంలో చేర్చండి. పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని తినిపించండి రోజూ కొంత సమయం పాటు శారీరక శ్రమ చేయడానికి అనుమతించండి.