Papaya Fruits: ఇష్టమని ఎడాపెడా తినేస్తే లేనిపోని చిక్కుల్లో పడతారు.. ఈ పండుతో కాస్త జాగ్రత్త!
బొప్పాయిలోని పోషకాలు అనేక వ్యాధులను కూడా నివారించగలవు. ఈ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనప్పటికీ, కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారి ఆరోగ్యానికి బొప్పాయి అంత మంచిది కాదు. అంటే బొప్పాయి అందరికీ ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చదన్నమాట. కాబట్టి బొప్పాయి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

బొప్పాయి పోషకమైన పండు. ఈ పండులో అవసరమైన విటమిన్లు, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అందించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సితో పాటు ఫైబర్, కెరోటిన్, విటమిన్ ఇ, ఎ, శరీరానికి చాలా ప్రయోజనకరమైన అనేక ఇతర ఖనిజాలు కూడా ఉన్నాయి. బొప్పాయిలోని పదార్థాలు అనేక వ్యాధులను కూడా నివారించగలవు. ఈ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనప్పటికీ, కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారి ఆరోగ్యానికి బొప్పాయి అంత మంచిది కాదు. అంటే బొప్పాయి అందరికీ ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చదన్నమాట. కాబట్టి బొప్పాయి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
బొప్పాయిలో పీచుపదార్థం అధికంగా ఉండి, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ బొప్పాయి తినడం మంచిది. అయితే ఈ కింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దీనిని తినకూడదు.
పచ్చకామెర్లు, ఆస్తమా ఆరోగ్య సమస్యలు
పచ్చకామెర్లు, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారు బొప్పాయిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బొప్పాయిలో పాపైన్ వంటి ఎంజైమ్‌లు, బీటా-కెరోటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కామెర్లు, ఆస్తమాతో బాధపడేవారిలో ఇవి పరిస్థితిని మరింత తీవ్రతరం చేయగలవు.
కిడ్నీ వ్యాధులు
మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్నవారు బొప్పాయిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. ఎందుకంటే బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. దీనిని శరీరంలో అధికంగా తీసుకుంటే అది ఆక్సలేట్‌గా మారే అవకాశం ఉంది. ఈ అదనపు ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇప్పటికే ఉన్న రాళ్ల పరిమాణాన్ని పెంచే అవకాశం కూడా లేకపోలేదు.
గుండె సమస్యలు
అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారు బొప్పాయిని పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధులు ఉన్నవారు తీసుకునే కొన్ని మందులతో బొప్పాయిలోని ఎంజైమ్‌లు చర్య జరిపి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. దీనివల్ల అలర్జీలు, దురద, శరీరంపై దద్దుర్లు వస్తాయి. అందుకే వైద్యుల సలహా మేరకు మాత్రమే బొప్పాయి తినాలి. అంతేకాకుండా ఏవైనా ఇతర దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా తప్పకుండా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే బొప్పాయి తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




