వర్షం కారణంగా చాలా మందికి జుట్టు సమస్యలు ఎదురవుతుంటాయి. వాతావరణంలో తేమ విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల జుట్టు రాలడం, నెరిసిన జుట్టు మొదలైన సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమయంలో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఉత్పత్తులను చాలా మంది ఉపయోగిస్తున్నారు. వీటి వాడకం చాలా హానికరమని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటికి బదులు ఇంట్లో లభించే మెటీరియల్స్‌తో తయారైన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించాలి. ఇందుకు కావాల్సిన పదార్థాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..
తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుత ఔషధం ఇంట్లోనే ఉంది. అది దాల్చిన చెక్క.. దాల్చిన చెక్కలో చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. వీటిని వాడే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు తెల్లజుట్టుకు కూడా దాల్చిన చెక్క ఔషధం. ఈ హెయిర్ మాస్క్‌ను తయారుచేసే ముందు, అర కప్పు దాల్చిన చెక్క పొడి, కొబ్బరి నూనె తీసుకొని వాటిని ఒక గిన్నెలో బాగా కలపండి.
ఇలా కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అప్పుడు మీ జుట్టు కడగడం. దీంతో తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..