
కరోనా వచ్చిన తర్వాత పరిశుభ్రత పెరగింది. ముఖ్యంగా చేతులు కడుక్కోవడంలో. ఇక అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరుపుకుంటారు. పరిశుభ్రత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి దీనిని నిర్వహిస్తారు. చేతులు కడుక్కోవడం అనేది అతి ముఖ్యమైన అలవాటు. ఇది విరేచనాలు, జలుబు, ఫ్లూ, కోవిడ్ వంటి అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. తినడానికి ముందు, టాయిలెట్ తర్వాత, బయటి వస్తువులను తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం ఎప్పుడూ మంచిదే. అయితే నిపుణులు దీనిపై ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల కూడా మనకు హాని కలుగుతుంది. చేతులను అతిగా కడుక్కోవడం వల్ల శరీరంలో కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాం.
మనం సబ్బులు, హ్యాండ్ వాష్‌లను ఎక్కువగా ఉపయోగించినప్పుడు.. చర్మం యొక్క సహజ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. చర్మంలోని సహజ నూనెలు, మంచి బ్యాక్టీరియా తొలగిపోతాయి. దీని వల్ల ఈ సమస్యలు వస్తాయి..
చర్మం దురద : సబ్బుతో తరచుగా చేతులు కడగడం వల్ల చర్మం పై పొర తొలగిపోతుంది. దీనివల్ల చర్మం పొరలుగా మారుతుంది. దురదగా ఉంటుంది. కొన్నిసార్లు పగుళ్లు కూడా వస్తాయి.
సహజ నూనె కోల్పోవడం: చర్మంలోని సహజ నూనెలు చేతులను సాఫ్ట్‌గా ఉంచుతాయి. తరచుగా కడగడం వల్ల ఈ నూనె తొలగిపోయి.. చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది.
తామర సమస్య: ఇప్పటికే తామర సమస్య ఉన్నవారికి, తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. దీనివల్ల చేతులు చికాకుగా, ఎర్రగా మారతాయి.
చర్మశోథ : చేతులను అతిగా కడుక్కోవడం వల్ల కాంటాక్ట్ చర్మశోథ వస్తుంది. దీని వలన చర్మం వాపు వస్తుంది. దురద, ఎరుపు రంగులోకి మారుతుంది.
ఇన్ఫెక్షన్ ప్రమాదం : చర్మం పగిలిపోయినప్పుడు లేదా పగుళ్లు ఏర్పడినప్పుడు.. బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది నిజానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
చేతులు కడుక్కోవడం చాలా అవసరం. అయితే అవసరమైనప్పుడు మాత్రమే కడుక్కోవడం మేలు.
ఎప్పుడు కడగాలి: టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, తినడానికి ముందు, బయటి నుండి ఇంటికి వచ్చిన తర్వాత, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తాకిన తర్వాత, తుమ్మిన లేదా దగ్గిన తర్వాత.
ఎలా కడగాలి: కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో, నీటితో శుభ్రం చేయాలి. వేళ్ల మధ్య, గోళ్ల కింద, చేతుల వెనుక భాగంలో బాగా శుభ్రం చేసుకోవాలి.
మీరు మీ చేతి పరిశుభ్రతను పాటించాలి, కానీ అదే సమయంలో మీ చర్మాన్ని రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..