
మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే పోషకాల నిధి. అవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని చేర్చాలనుకుంటే మొలకలను సలాడ్స్‌గా, స్పైసీగా వీటిని తీసుకోవచ్చు. మొలకెత్తిన గింజలపై చిటికెడు ఉప్పు,నిమ్మరసం, స్పైసీగా చేసుకుని తినవచ్చు.
మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ సమృద్దిగా ఉండటం వలన రోగినిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి,ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ సమృద్దిగా ఉన్నటువంటి మొలకెత్తిన గింజలను తినడం వలన కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండేటువంటి మొలకెత్తిన గింజలు తినడం వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఫైబర్, ఎంజైములు సమృద్దిగా ఉన్నటువంటి మొలకెత్తిన గింజలు తినడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. మొలకెత్తిన విత్తనాల్లో పెసలు, శనగలు, పల్లీలు, మెంతులు, కిడ్నీ బీన్స్ వంటి మొలకెత్తిన ధాన్యాలు ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉన్న మొలకలు మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిని మరింత రుచికరంగా చేయడానికి, మీరు ఉల్లిపాయ, టమోటా, నిమ్మకాయ, దోసకాయ వంటి పదార్థాలను కూడా యాడ్ చేసుకోవచ్చు.
మొలకలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇనుము, రాగితో సమృద్ధిగా ఉంటాయి. మొలకలు తినడం వల్ల గ్లూటెన్‌కు సున్నితంగా ఉండే వ్యక్తులకు ప్రయోజనకరం. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మొలకలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. మలబద్ధకం, కడుపు సమస్యలను నివారిస్తాయి. మొలకలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. హృదయ సంబంధ వ్యాధులు, అధిక క్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
మొలకలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. మొలకలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా వాటిని దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తహీనత ఉన్న రోగులు మొలకలు తినాలి. ఎందుకంటే వాటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, అవి ఎర్ర రక్త కణాల సంఖ్యను బాగా నిర్వహించడానికి సహాయపడతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..