చాక్లెట్ ప్రియులకు సవాల్.. నెల రోజులు తినకుంటే ఏమౌతుందో చూడండి!

|

Oct 03, 2023 | 1:01 PM

చాక్లెట్ ప్లేస్ లో మీరు పండ్లను కూడా తీసుకోవచ్చు. మామిడి, పైనాపిల్, బ్లాక్‌బెర్రీ లేదా పీచెస్ వంటి సహజమైన తీపి పండ్లను రెగ్యూలర్ గా తినటం అలవాటు చేసుకోండి. మీరు చాక్లెట్ తినాల్సి వస్తే, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఇంట్లో తయారు చేసుకోండి.

చాక్లెట్ ప్రియులకు సవాల్.. నెల రోజులు తినకుంటే ఏమౌతుందో చూడండి!
Follow us on

చాక్లెట్‌ని ఎవరు ఇష్టపడరు చెప్పండి..? పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ చాక్లెట్‌ అంటే ఇష్టముంటుంది. భోజనం చేసి చిరుతిండి తర్వాత చాక్లెట్ తినాలి అని చెప్పేవారూ కూడా ఉన్నారు. కొందరికీ ఎప్పుడూ బ్యాగ్‌లో చాక్లెట్ ఉంటుంది. అది వారికి ఎంతో తృప్తినిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు బ్యాగ్‌లోని ఆ చాక్లెట్‌ని బయటకు తీసి తింటారు. కొంతమంది చాక్లెట్ కేక్, చాక్లెట్ ఐస్ క్రీం, చాక్లెట్ ఫ్లేవర్‌తో కూడిన ప్రతిదాన్ని ఇష్టపడతారు. అవును.. చాక్లెట్ అంటే ఇష్టమైతే.. అది తిన్నాక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పే వారు కొందరైతే… నెల రోజుల పాటు చాక్లెట్ మానేయండి. ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా చెబుతున్నారు..ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చాక్లెట్ తినడం ఒక వ్యసనం లాంటిది. తిన్న తర్వాత నోటికి చాక్లెట్ తింటే బాగుంటదని ప్రతి పూటా అదే చేసేవారు.. చాక్లెట్‌ స్థానంలో.. ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరం లాంటివి తినవచ్చు. మిఠాయిలు శరీరానికి మంచివి కాకపోయినా వాటి వల్ల ఎక్కువ హాని కలుగుతుంది.

చాక్లెట్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక నెలపాటు చాక్లెట్ తినటం మానేస్తే.. మీ శరీరంలోని కేలరీలను నియంత్రించవచ్చు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

పిల్లలకు చాక్లెట్ కాకుండా పిప్పరమెంటు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చాక్లెట్ నోటికి అంటుకుంటుంది. ఇది పంటి నొప్పి, దంతక్షయంతో సహా అనేక దంత సమస్యలను కలిగిస్తుంది. అలాగే చాక్లెట్ తినడం మానేస్తే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మీరు చాక్లెట్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే, కొంతమంది దానిని వదులుకున్న తర్వాత సమస్యలను ఎదుర్కొంటారు. మీకు చిరాకుగా అనిపించవచ్చు. కానీ ఈ చిరాకు తాత్కాలికమే. మీరు కొన్ని రోజుల్లో ఈ చికాకు నుండి బయటపడవచ్చు.

చాక్లెట్ వదులుకున్న తర్వాత తలనొప్పి. మీరు ప్రతిరోజూ చాక్లెట్ తింటే, దానిని మానేసినప్పుడు తీవ్ర తలనొప్పి వస్తుంది. అయితే ఇది కూడా తాత్కాలికమే. చాక్లెట్‌కు బదులుగా, సహజంగా తియ్యని ఆహారాన్ని తినడం ప్రారంభించండి. ఇది మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు.

మీరు కోకోలో అధికంగా ఉండే డార్క్ చాక్లెట్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. చాక్లెట్‌కు బదులు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యకరం. చాక్లెట్ ప్లేస్ లో మీరు పండ్లను కూడా తీసుకోవచ్చు. మామిడి, పైనాపిల్, బ్లాక్‌బెర్రీ లేదా పీచెస్ వంటి సహజమైన తీపి పండ్లను రెగ్యూలర్ గా తినటం అలవాటు చేసుకోండి. మీరు చాక్లెట్ తినాల్సి వస్తే, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఇంట్లో తయారు చేసుకోండి.

44 గ్రాముల చాక్లెట్‌లో 235 కేలరీలు, 221 గ్రాముల చక్కెర ఉంటుంది. మనం దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్య, పక్షవాతం, ఆందోళన, కడుపునొప్పి, కిడ్నీ సమస్యలు వేధిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..