Mumps Virus: గవద బిళ్లలు రావడానికి కారణాలు ఏంటి? రాకుండా ఏం చేయాలంటే?

గవద బిల్లల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. వాతావరణంలో సీజన్లు మారినప్పుడల్లా ఇవి కూడా వస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ గవద బిల్లలు అనేవి కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది పిల్లలు గవద బిల్లల వైరస్ బారిన పడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. కేరళలో కూడా చాలా మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. గవద బిల్లలు వస్తే బుగ్గలు బాగా ఉబ్బిపోయి..

Mumps Virus: గవద బిళ్లలు రావడానికి కారణాలు ఏంటి? రాకుండా ఏం చేయాలంటే?
Mumps Virus

Updated on: Mar 22, 2024 | 1:36 PM

గవద బిల్లల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. వాతావరణంలో సీజన్లు మారినప్పుడల్లా ఇవి కూడా వస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ గవద బిల్లలు అనేవి కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది పిల్లలు గవద బిల్లల వైరస్ బారిన పడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. కేరళలో కూడా చాలా మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. గవద బిల్లలు వస్తే బుగ్గలు బాగా ఉబ్బిపోయి.. దవడలు నొప్పిగా ఉంటాయి. కదపడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. గవద బిల్లలు వస్తే.. తినడానికి, మంచినీళ్లు తాగడానికి కూడా కష్టంగా ఉంటుంది. అంతే కాకుండా జ్వరం, దగ్గు కూడా వస్తాయి. నీరసంగా వీక్‌గా అయిపోతారు. అసలు ఈ ఇన్ ఫెక్షన్ ఎందుకు వస్తుంది? నివారణా చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గవద బిల్లల వైరస్ ఎందుకు వస్తుంది?

పారామైక్సో వైరస్ వల్ల ఈ గవద బిల్లలు అనేవి వస్తాయి. ఇది కూడా ఒక రకమైన వైరల్ ఇన్ ఫెక్షన్. ఈ ఇన్ ఫెక్షన్ కారణంగా గవద బిల్లలు వస్తాయి. ఈ ఇన్ ఫెక్షన్ వల్ల లాలాజల గ్రంథులు ప్రభావితం అవుతాయి. వీటి వల్ల బుగ్గలు బాగా ఉబ్బిపోతాయి. గొంతులో నొప్పిని కూడా కలిగిస్తాయి. గవద బిల్లలు అనేవి ఏ వయసు వారికైనా వస్తాయి. సరైన చికిత్స తీసుకుంటే వారం రోజుల్లో నయం అయిపోతుంది.

గవద బిల్లల లక్షణాలు:

అలసటగా అనిపించడం, బలహీనంగా ఉండటం, జ్వరం, తల నొప్పి, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, నోరు పొడిబారిపోవడం, నమలడానికి, మింగడానికి ఇబ్బందిగా ఉండటం. ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగానే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

నివారణా చర్యలు:

గవద బిల్లలు వచ్చిన వారు ఎక్కువగా పరిశుభ్రత పాటించాలి. ఇది కూడా ఒక రకమైన వైరస్ కాబట్టి.. ఇతరులకు కూడా సోకవచ్చు. కాబట్టి ఇతరులకు దూరంగా ఉంటడం మంచిది. అలాగే గవద బిల్లలు వచ్చిన వ్యక్తి వస్తువులను.. ఇతరులు తాకకూడదు. వీరు వాడిన పాత్రలు కూడా ముట్టుకోకూడదు. వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..