ఆహారానికి రుచి, వాసన కోసం మనం పలు వంటకాల్లో ఏలకులను ఉపయోగిస్తాము. ఏలకులు రుచి ఘాటుగా, కాస్త తీపిగా, శీతలీకరణ అనుభూతిని కలిగిస్తుంది. చాలా మంది ఏలకులను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. ఏలకులు శ్వాసను తాజాగా ఉంచుతాయి. కూరల నుండి బేకింగ్ వరకు.. ఏలకులను అనేక వంటలలో కూడా ఉపయోగిస్తారు. వీటిని మసాలాగానే కాకుండా రుచికోసం తీపి వంటలలో కూడా వాడుతారు. అయితే, ఏలకులు కేవలం రుచి, వాసన కోసం మాత్రమే కాదు.. ఏలకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మసాలా. ప్రతిరోజూ ఏలకులు వేసి మరిగించిన నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయం లేవగానే యాలకుల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏలకుల నీరు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పొత్తికడుపు, శరీరంలోని ఇతర భాగాలలో కొవ్వు పేరుకుపోకుండా ఏలకుల నీరు సహాయపడుతుంది. శరీరంలో అధిక కొవ్వు చేరడం అనేది జీవక్రియను అడ్డుకునే, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచే వాటిలో ఒకటి. ఏలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేరుకుపోయిన కొవ్వును కొవ్వొత్తిలా కరిగిస్తుంది. మంచి జీర్ణక్రియ మెటబాలిజం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఏలకులలోని పోషక గుణాలు శరీరంలోని చెడు కొవ్వును పోగొట్టడంలో సహాయపడతాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఏలకులు ప్రభావవంతంగా ఉంటాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ చేయబడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా రోజూ ఏలకుల నీటిని తాగవచ్చు.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే ఏలకులు కూడా నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత ఏలకుల నీటిని తాగడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..