
ఆమ్లెట్ తినేందుకు చాలా మంది ఇన్‌ట్రెస్ట్ చూపిస్తారు. కానీ దానిలో ఆయిల్ ఉంటుందని దానిని దూరం పెడతారు. అయితే అలాంటి వారికి ఇదొ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు నూనె లేకుండా మీకు నచ్చినన్ని ఆమ్లెట్లు చేసుకోవచ్చు. ఒక చుక్క నూనె లేకుండా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం. నూనె లేకుండా ఆమ్లెట్ తయారు చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటి ఆవిరితో ఆమ్లెట్ తయారు చేయడం. రెండొది నాన్‌స్టిక్ ప్యాన్‌పై ఆమ్లెట్ చేయడం.
1.ఆవికి పద్దతిలో ఆమ్లెట్ చేయడం.
ఈ పద్ధతిలో ఆమ్లెట్ తయారు చేయడానికి మకు గుడ్లు, ఉప్పు, మిరియాలు, మీకు నచ్చిన కూరగాయలతో పాటు ఒక ఫుడ్ గ్రేడ్ బ్యాగ్‌లో తీసుకోండి. తర్వాత ఒక బౌల్‌లో గుడ్లు పగులగొట్టండి, వాటిని బాగా కలపండి తర్వాత పాలు (లేదా నీళ్లు), ఉప్పు, తరిగిన మిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, ఏమైనా మసాలాలు అన్నీ కలిపి మళ్లీ బాగా కలపండి. మిశ్రమం సన్నగా, బుడగలు లేకుండా ఉండాలి. తర్వాత ఒక స్టీమర్ బౌల్ లేదా స్టీమింగ్ టిన్, సిలికాన్ మోల్డ్ తీసుకోండి. తర్వాత అందులో మీరు మందుగా కలిపి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని పోయండి. ఫుల్‌గా పోయకుండా పెద్ద సగం వరకు పోయండి. తర్వాత ఒక పెద్ద పాత్రలో నీళ్లు పెట్టి మరిగించండి . ఆ తర్వాత బౌల్‌ను స్టీమర్ ర్యాక్ మీద పెట్టి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 12–18 నిమిషాలు ఆవిరి పంపండి.12 నిమిషాల తర్వాత చెక్ చేయండి. మధ్యలో టూత్‌పిక్ పెడితే స్వచ్ఛంగా బయటికి వస్తే సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి 2–3 నిమిషాలు అలాగే ఉంచండి. జాగ్రత్తగా తీసి, కత్తితో కట్ చేసి సర్వ్ చేయండి.
2.నాన్‌స్టిక్ ప్యాన్‌పై ఆమ్లెట్ తయారీ
రెండవ పద్ధతిలో, మీరు నాన్-స్టిక్ పాన్, నీటిని ఉపయోగించాలి. ముందుగా, గుడ్లను బాగా కొట్టి, దానికి కొన్ని ఉప్పు, మిరియాలు, తరిగిన ఉల్లిపాయ, టమోటా మరియు కొత్తిమీర జోడించండి. అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్లు నీరు లేదా పాలు జోడించండి. ఇప్పుడు మీడియం మంట మీద నాన్-స్టిక్ పాన్ వేడి చేయండి. పాన్ వేడెక్కిన తర్వాత, గుడ్డు మిశ్రమాన్ని లోపల పోయాలి. మిశ్రమాన్ని విస్తరించడానికి పాన్‌ను వంచి ఉంచండి. ఇప్పుడు దానిని కప్పి తక్కువ మంట మీద ఉడికించాలి. గుడ్డు మిశ్రమం గట్టిపడిన తర్వాత, దానిని తిప్పండి. నూనె లేని ఆమ్లెట్ తయారు చేసి, రుచికరమైన ఆమ్లెట్‌ను ఆస్వాదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.