Weight Loss Tips: బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? ఈ నాలుగింటిని రాత్రి పడుకునే ముందు తినండి..

బరువు పెరగడం వలన మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతుంది.

Weight Loss Tips: బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? ఈ నాలుగింటిని రాత్రి పడుకునే ముందు తినండి..
Weight Loss

Updated on: May 29, 2022 | 9:17 AM

How To Burn Belly Fat: ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. బరువు పెరగడం అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరగడం వల్ల శరీరం ఆకృతి దుర్భరంగా మారుతుంది. దీని కారణంగా ఇబ్బందులను అనుభవించవలసి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే.. బరువు తగ్గాలంటే కొన్ని ఆహార పదార్థాలను తినాలని సూచిస్తున్నారు.

బరువు తగ్గాలంటే రాత్రిపూట ఈ ఆహారాలను తినండి..

చాలామంది.. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆరోగ్యాన్ని పాడుచేసే వాటిని తరచుగా తింటున్నారు. అలాగే బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. అయితే.. ఇలాంటి వారు ఈ 4 ఆహారాల గురించి తెలుసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నాలుగింటిని రాత్రి పడుకునే ముందు తింటే బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుందంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

పెరుగు: రాత్రిపూట ఆహారం తిన్న తర్వాత మీరు తప్పనిసరిగా పెరుగు కూడా తీసుకోవాలి. ఇందులో కేలరీలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కండరాలకు బలాన్ని ఇస్తుంది. దీనితో పాటు పెరుగులో ఉండే సూక్ష్మపోషకాలు జీర్ణక్రియను సరిగ్గా ఉంచి బరువును కూడా తగ్గిస్తాయి.

బాదం: చాలా సార్లు మనకు రాత్రిపూట అకస్మాత్తుగా ఆకలిగా అనిపిస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులతో ఇది తరచుగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని బాదంపప్పులను తినవచ్చు. ఆకలిని తీర్చడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. బాదంపప్పులో ముఖ్యమైన పోషకాలు ఉండటంతోపాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. నానబెట్టి తింటే మరింత మేలు జరుగుతుంది.

హోల్ గ్రెయిన్ బ్రెడ్: మీకు రాత్రిపూట ఆకలిగా అనిపిస్తే పీనట్ బటర్‌ను అప్లై చేసి.. హోల్ గ్రెయిన్ బ్రెడ్‌ను తినవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అరటిపండు: అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారని చాలామంది పేర్కొంటుంటారు. అయితే.. ముమ్మాటికీ అబద్దం. దీనిలో బరువు తగ్గడానికి పని చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పండులో ఉండే పీచు పదార్థం వల్ల ఎక్కువ కాలం ఆకలి ఉండదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Follow Us