AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Bottle: ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. నీళ్లు తాగడానికి ఏ బాటిల్ మంచిది..?

నీళ్లు తాగేందుకు ఉపయోగించే బాటిల్‌ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..? ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాల్లో ఏది ఆరోగ్యానికి మంచిది? రోజువారీ వినియోగానికి స్టీల్, ఇంట్లో గాజు లేదా మట్టి బాటిళ్లు, రాగి బాటిల్‌ను పరిమితంగా ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లను సాధ్యమైనంత వరకు నివారించడం మంచిదని చెబుతున్నారు.

Water Bottle: ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. నీళ్లు తాగడానికి ఏ బాటిల్ మంచిది..?
Best Water Bottle
Shaik Madar Saheb
|

Updated on: Aug 26, 2026 | 6:28 PM

Share

మనలో చాలామంది దాహం వేసినప్పుడు ఎదురుగా ఏ బాటిల్ ఉంటే దాంతో నీళ్లు తాగుతుంటారు. కానీ, మనం నీరు తాగే బాటిల్ (సీసా మెటీరియల్) మన ఆరోగ్యంపై, పర్యావరణంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలుసా..? అవును మీరు చదివింది నిజమే.. మనం తాగే నీటితోపాటు.. బాటిల్ కూడా కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. తాగునీరు నిల్వ కోసం ప్లాస్టిక్, గాజు, రాగి, స్టెయిన్‌లెస్ స్టీల్, మట్టి పాత్రలను ఉపయోగిస్తాం.. అయితే.. ఇవి..ఏదో రకంగా పలు ప్రభావాలను చూపుతాయని పేర్కొంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్ లోని నీరు తాగొద్దని తరచూపేర్కొంటుంటారు. అయితే.. ప్లాస్టిక్ తోపాటు.. ఏ బాటిల్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

వివిధ రకాల బాటిళ్ల ప్రయోజనాలు, ప్రతికూలతలు.. వాటి ఉపయోగం పై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

గాజు బాటిళ్లు (Glass Bottles):

గాజు ఏ రసాయనాలతోనూ చర్య జరపదు (Non-toxic). వేడి తగిలినా నీటిలోకి ఎలాంటి విషపూరిత రసాయనాలు విడుదల కావు. ఇది 100% రీసైకిల్ చేయదగినది. అయితే, బరువు ఎక్కువ, అలాగే సులభంగా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇల్లు లేదా ఆఫీసు వాడకానికి అనుకూలంగా ఉంటుంది కానీ.. ప్రయాణాలకు అంత సౌకర్యవంతం కాదు.

ఇవి కూడా చదవండి

రాగి బాటిళ్లు (Copper Bottles):

ఆయుర్వేదంలో రాగికి ప్రత్యేక స్థానం ఉంది. రాగి పాత్రలో నీరు నిల్వ చేయడం వల్ల నీటి pH స్థాయి పెరిగి అల్కలైన్‌గా మారుతుంది. ఇది బ్యాక్టీరియాను నశింపజేసి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే.. సరిగ్గా శుభ్రం చేయకపోతే లోహపు రుచి వస్తుంది. ఎక్కువగా వాడితే శరీరంలో కాపర్ టాక్సిసిటీ పెరిగి వాంతులు, కాలేయ సమస్యలు రావచ్చు. రాగి పాత్రలో పాలు లేదా నిమ్మరసం వంటి ఆమ్ల (Acidic) పదార్థాలను పోయకూడదు. పరిమితంగా వాడాలి.

ప్లాస్టిక్ బాటిళ్లు (Plastic Bottles):

ప్లాస్టిక్ బాటిళ్లు తేలికైనవి.. చౌకైనవి.. దాదాపు అందరూ వీటినే ఉపయోగిస్తారు.. అయితే.. ఇవి అంత మంచివి కావు.. ప్లాస్టిక్‌లో ఉండే BPA, Phthalates వంటి విషరసాయనాలు వేడి తగిలినప్పుడు నీటిలోకి చేరుతాయి. ఇవి క్యాన్సర్, మెదడు ఎదుగుదల లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వీటి నుండి మైక్రో ప్లాస్టిక్స్ నీటి ద్వారా రక్తంలోకి చేరుతాయి. పర్యావరణానికి కూడా ఇది అత్యంత ప్రమాదకరం. అందుకే.. ప్లాస్టిక్ బాటిళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలి. తప్పనిసరైతే BPA-Free బాటిళ్లను మాత్రమే ఎంచుకోవాలి.

స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు (Stainless Steel Bottles):

రసాయనాలు కలవవు, మన్నికైనవి.. తేలికైనవి. వేడి, చల్లని, ఆమ్ల పానీయాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి.. పూర్తిగా పర్యావరణహితమైనవి.. అయితే.. నాణ్యమైన స్టీల్ బాటిళ్లు కొంత ఖరీదైనవి.. చాలా మంది తీసుకోరు.. రోజువారీ వాడకానికి, ప్రయాణాలకు, సస్టైనబిలిటీ పరంగా స్టీల్ బాటిళ్లు అత్యుత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.

మట్టి బాటిళ్లు (Earthenware / Clay Bottles):

మట్టిలో సహజ అల్కలైన్ గుణాలు ఉండటం వల్ల నీటి pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. నీటిని సహజంగా చల్లబరుస్తుంది, అసిడిటీని తగ్గిస్తుంది. నీటికి అవసరమైన ఖనిజాలను (Trace Minerals) జోడిస్తుంది. గాజులాగే కిందపడితే పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.

మీ జీవనశైలి, ఆరోగ్యం, పర్యావరణ రక్షణను దృష్టిలో ఉంచుకుని సరైన బాటిల్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ప్రయాణాలకు స్టీల్ బాటిల్, ఇంట్లో మట్టి లేదా గాజు బాటిల్, నియమబద్ధమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం పరిమితంగా రాగి బాటిల్ వాడటం మంచిది. ప్లాస్టిక్ బాటిళ్లను మాత్రం ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే చూడాలంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?
ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?
రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..
రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?