Diabetes Problem: ఆ ఒక్క పనితో మధుమేహ సంబంధిత సమస్యలు దూరం.. తప్పనిసరిగా చేయాలంటున్న వైద్యులు

ముఖ్యంగా నడక వ్యవధిపై ఆధారపడి షుగర్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ నిర్వహణకు మంచి వ్యాయామంగా నడక ఉంటుందని నిపుణుల వాదన. అడుగుల లెక్కన కొలిస్తే డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు కచ్చితంగా రోజుకు 5000 అడుగులైన నడవాల్సిందేనని పేర్కొంటున్నారు.

Diabetes Problem: ఆ ఒక్క పనితో మధుమేహ సంబంధిత సమస్యలు దూరం.. తప్పనిసరిగా చేయాలంటున్న వైద్యులు
Diabetes (5)

Updated on: Jun 17, 2023 | 6:30 PM

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుత రోజుల్లో షుగర్ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా ఇబ్బంది పెడతుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. నడక వంటి సాధారణ శారీరక శ్రమ సమర్థవంతమైన వ్యూహంగా ఉంటుంది. ముఖ్యంగా నడక వ్యవధిపై ఆధారపడి షుగర్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ నిర్వహణకు మంచి వ్యాయామంగా నడక ఉంటుందని నిపుణుల వాదన. అడుగుల లెక్కన కొలిస్తే డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు కచ్చితంగా రోజుకు 5000 అడుగులైన నడవాల్సిందేనని పేర్కొంటున్నారు. నడక ముఖ్యమే అయినా ఒకేసారి నడిచి అలసటకు గురయ్యే మొత్తం రోజులో విడతల వారీగా నడవాలని సూచిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర నియంత్రణ

మీరు నడిచినప్పుడు మీ శరీరం గ్లూకోజ్ (చక్కెర) రూపంలో శక్తిని ఉపయోగిస్తుంది. టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తుల్లో శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. అయినప్పటికీ, శారీరక వ్యాయామంలో పాల్గొనడం ఆ చక్కెరను ఉపయోగించడంలో సహాయపడుతుంది. తద్వారా దాని చక్కెర స్థాయిల తగ్గింపులో సహాయం చేస్తుంది.

బరువు నిర్వహణ

బరువు తగ్గడానికి మీరు తీసుకునే కేలరీల కంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారంతో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కాబట్టి నడక బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన సాధనంగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం మెరుగు

మధుమేహం లేని వ్యక్తుల కంటే మధుమేహం ఉన్నవారిలో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. నడక కూడా రక్తపోటును తగ్గిస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం

నడక ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి మీ మానసిక స్థితిని పెంచే, ఒత్తిడిని తగ్గించే మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు. మధుమేహం ఉన్న వ్యక్తులు నిరాశకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టటి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నడక ఒక సాధనంగా పని చేస్తుంది. 

ఓర్పు పెంపు

సాధారణ నడకలో పాల్గొనడం వల్ల మీ ఫిట్‌నెస్, ఓర్పు స్థాయిలు పెరుగుతాయి.

ఎముకలు, కండరాలకు మేలు

నడక దినచర్యలలో స్థిరంగా నిమగ్నమవడం శక్తిని పెంచుతుంది. అలాగే ఎముకలను బలపరుస్తుంది, తద్వారా గాయం నివారణలో అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..