Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్ ఫాలో చేస్తే చాలు..
రోజూ లేవగానే కాస్త అటు ఇటు నడిస్తే గుండెకు వచ్చే ముప్పు దాదాపు సగానికి తగ్గిందని తాజాగా నిపుణులు జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం గురించిన పూర్తి వివరాలు మీకోసం..

నడక నాలుగు విధాలా మంచిది. ఇది నిపుణులు తరచూ చెబుతూ ఉండే ఆరోగ్య మంత్రం. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాలకు ఇదే విరుగుడు. ఎన్ని మందులు వాడినా.. ఎంత కఠినంగా డైట్ మెయింటేన్ చేసినా.. వాటి నుంచి పూర్తి ప్రయోజనం పొందాలంటే మాత్రం ప్రతి రోజూ వాకింగ్ చేయాల్సిందే. అంతేకాక గుండె పదికాలాలపాటు పదిలంగా ఉండాలన్న ఈ నడకే మంచి మందు అని మరోసారి నిరూపించారు నిపుణులు. ప్రతి రోజూ లేవగానే కాస్త అటు ఇటు నడిస్తే గుండెకు వచ్చే ముప్పు దాదాపు సగానికి తగ్గిందని తాజాగా నిపుణులు జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం గురించిన పూర్తి వివరాలు మీకోసం..
అమెరికన్ హార్ట్ అసోసియేషన్..
అమెరికాకకు చెందిన హార్ట్ అసోసియేషన్ చెందిన జర్నల్ అసోసియేషన్ ఓ అధ్యయనాన్ని చేపట్టింది. 18 ఏళ్లు పైబడిన వారిలో నడక ద్వారా గుండెకు చేకూరుతున్న ప్రయోజనాన్ని నిపుణుల బృందం గుర్తించింది. దాదాపు 20,152 మందిపై ఆరేళ్ల పాటు ఈ పరిశోధన కొనసాగింది. రోజూ వారు నడిచే దూరాన్ని బట్టి గుండెకు ఒనగూరుతున్న ప్రయోజనాన్ని స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ ఫోన్‌ల సాయంతో గుర్తించింది. ఇలా ఎనిమిది దఫాలుగా పరిశోధనలు చేసి చివరి ఫలితాన్ని వారు ప్రచురించారు.
రోజూ తొమ్మిది వేల అడుగులు నడిస్తే..
ఈ అధ్యయనం ప్రకారం రోజూ తొమ్మిది వేల అడుగులు నడిస్తే దాదాపు 40 నుంచి 50 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిందని ఆ అధ్యయనం వెల్లడించింది. వయసుల వారీగా చూస్తే.. మధ్య వయస్కుల్లో రోజూ ఆరు వేల నుంచి తొమ్మిది వేల అడుగులు నడిస్తే వారిలో 50 శాతం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది. ఇక 60 ఏళ్లు పైబడిన వారు ఎంత ఎక్కువ నడిస్తే వారి గుండెకు అంత మంచిది. యుక్తవయసులో ఉన్న వారి నడకకు, గుండె ఆరోగ్యానికి పెద్ద సంబంధం లేదని ఆ అధ్యయనంలో నిపుణులు పేర్కొన్నారు. అయితే చిన్ననాటి నుంచే నడక అలవాటు చేసుకుంటే మంచిదని సూచించారు.



మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..
