Vitamin D: మీరు శాఖహారులా.. ఎముకలు బలంగా ఉండాలంటే.. వీటిని తినే ఆహారంలో చేర్చుకోండి..

విటమిన్ డి శరీరంలో ఎముకలను బలంగా ఉంచడానికి చాలా ముఖ్యమైన విటమిన్. ఎముకలు, కండరాలు, నరాలు , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మొత్తానికి శరీరం ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ డి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది ఈ విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో విటమిన్ డి దొరికే శాఖాహార పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం..

Vitamin D: మీరు శాఖహారులా.. ఎముకలు బలంగా ఉండాలంటే.. వీటిని తినే ఆహారంలో చేర్చుకోండి..
Vitamin D Rich Foods

Updated on: May 26, 2025 | 6:20 PM

విటమిన్ డి లో రెండు రకాలు ఉన్నాయి. డి2, డి3. ఇవి కొవ్వులో కరుగుతాయి. విటమిన్ డి సహజంగా సూర్యకిరణాల ద్వారా లభిస్తుంది. అంతేకాదు అనేక ఆహార పదార్ధాల ద్వారా కూడా లభిస్తుంది. D2 విటమిన్ కొన్ని మొక్కలు, ఈస్ట్ వనరులు, పుట్టగొడుగులు మొదలైన వాటి ద్వారా లభిస్తుంది. అయితే D3 ఎక్కువగా మాంసాహార ఆహారాలు మంచి వనరులుగా పరిగణించబడుతున్నాయి., అయితే విటమిన్ D అవసరాన్ని కొన్ని శాఖాహార ఆహారాలు కూడా తీరుస్తాయి. శరీరంలో కాల్షియం శోషణను ప్రోత్సహించడానికి విటమిన్ D అవసరం. ఎముకలతో పాటు, గోర్లు, దంతాలు బలంగా ఉంచడానికి కూడా ఈ విటమిన్ అవసరం. అదే సమయంలో కండరాల కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి కూడా అవసరం.

పిల్లలలో విటమిన్ డి లోపం ఉంటే, వారి శారీరక అభివృద్ధి, ముఖ్యంగా ఎత్తు పెరుగుదల ఆగిపోవచ్చు. అంతే కాదు ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే రికెట్స్‌కు దారితీస్తుంది. దీని వలన ఎముకలు సన్నగా , బలహీనంగా మారడం, వంగడం ప్రారంభమవుతాయి. చాలా త్వరగా ఎముకల పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. పెద్దవారిలో విటమిన్ డి స్థాయి తక్కువగా ఉంటే అది ఆస్టియోమలాసియా లేదా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. దీనిలో ఎముకలు చాలా బలహీనంగా మారతాయి. చిన్న గాయం తాగినా కూడా ఎముకలు విరిగిపోతాయి. అటువంటి పరిస్థితి మీ మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నేపద్యంలో విటమిన్ డి లభించే శాఖాహార పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.

విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది?
నేడు చాలా మంది శరీరంలో విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేసే వారిలో విటమిన్ డి లోపం ముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీరికి సూర్య రశ్మి నేరుగా తాకదు. విటమిన్ డి తగ్గడానికి మరో కారణం విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోక పోవడం.

ఇవి కూడా చదవండి

రోజూ పాలు తాగండి
విటమిన్ డి అధికంగా ఉండే శాఖాహార ఆహారాల గురించి మాట్లాడుకుంటే, పాలు ఉత్తమ మూలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో కనీసం ఒక పెద్ద కప్పు పాలను ఆహారంలో చేర్చుకోవాలి. పాల నుంచి అధిక మొత్తంలో విటమిన్ డి లభించడమే కాదు కాల్షియం, ప్రోటీన్ కూడా మంచి పరిమాణంలో లభిస్తాయి.

ఆహారంలో పాల ఉత్పత్తులు
పాలతో పాటు పాల ఉత్పత్తులలో కూడా విటమిన్ డి, కాల్షియం, బి12, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు లబిస్తాయి. కనుక మజ్జిగ లేదా పెరుగును మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవాలి. అదే సమయంలో మీరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు పనీర్‌ను ఆహారంలో స్నాక్‌గా చేర్చుకోవచ్చు, ఇది విటమిన్ డి అవసరాన్ని తీరుస్తుంది.

పుట్టగొడుగులు
శరీరంలో విటమిన్ డి అవసరాన్ని తీర్చడానికి మీరు తినే ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవచ్చు. నిజానికి పుట్టగొడుగులు సూర్యరశ్మి తాకినప్పుడు విటమిన్ డిని గ్రహిస్తుంది. కనుక ఇది విటమిన్ డి ఉన్న మంచి ఆహారం. ముఖ్యంగా D3 ని పెంచడంలో సహాయపడుతుంది. కనుక దీనిని తినే ఆహారంలో చేర్చుకోండి.

సోయా టోఫు
విటమిన్ డి మొక్కల ఆధారిత వనరుల గురించి మాట్లాడుకుంటే తినే ఆహారంలో బలవర్థకమైన సోయా టోఫును చేర్చుకోవడం మంచి ఎంపిక. ఇది శరీరానికి విటమిన్ డి అందించడమే కాదు అనేక ఇతర పోషకాలను కూడా మంచి పరిమాణంలో అందిస్తుంది. నిజానికి బలవర్థకమైన ఆహారాలు అంటే వేర్వేరు మొత్తంలో పోషకాలను శరీరానికి అందించేవి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)