Lifestyle: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చలి పంజా విసురుతోన్న విషయం తెలిసిందే. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతుండడంతో చలి నుంచి తట్టుకోవడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటుంటారు. సాధారణంగా అయితే స్వెటర్లు, శాలువాలతో చలిని తరిమి కొడుతుంటారు. అయితే కొందరు మాత్రం హీటర్లను ఉపయోగిస్తుంటారు. చలిగా ఉన్న వాతావరణాన్ని వేడిగా మార్చడం ఈ హీటర్ల పని.
గాలిలోని తేమను గ్రహించి ఉష్ణోగ్రతను పెంచుతాయి ఈ హీటర్లు. దీంతో విపరీతంగా ఉన్న చలి తగ్గుతుంది. అయితే చలి నుంచి బయటపడి కాసేపు వేడి అయితే లభిస్తుంది కానీ.. ఈ హీటర్ల వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా.? హీటర్ల వినియోగం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
హీటర్లు చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సున్నితంగా ఉండే చిన్నారుల చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. అలాగే హీటర్ల నుంచి వచ్చే వేడి గాలిని పీల్చుకోవడం ద్వారా చిన్నారుల ముక్కు భాగంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయి.
గదులలో హీటర్లను ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీంతో తలుపులు మూసిఉండి బయటకు గాలి లోపలికి, లోపలి గాలి బయటకు వెళ్లకుండా ఉండే గదుల్లో ఉన్న వారికి వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి హీటర్లు వాడుతున్నప్పటికీ లోపలి గాలి బయటకు వెళ్లేలా జాగ్రత్తలు చూసుకోవాలి.
గదిలో ఉండే తేమను తగ్గించడమే హీటర్ల ముఖ్యమైన విధి. కాబట్టి వీటి కారణంగా చర్మంలోని తేమ కూడా తగ్గుతుంది. ఈ కారణంగా చర్మంపై దురద, అలర్జీలకు దారి తీస్తుంది. అంతేకాకుండా సున్నితంగా చర్మం ఉన్న వారికి ఈ ప్రభావం మరీ ఎక్కువ ఉంటుంది.
సాధారణంగా హీటర్లు కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువులను నేరుగా పీల్చుకోవడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో హీటర్లు ఉన్న గదుల్లో ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: UP Election 2022: ఐదు మాసాల్లో సీఎం యోగీ 100 పర్యటనలు.. యూపీ ఎన్నికల్లో ‘ఉపయోగి’ అవుతాయా?
Talibans: ఇదేం రాక్షస పాలనరా బాబు.. బొమ్మల తలలను నరికేస్తున్న తాలిబన్లు.. వైరల్ అవుతోన్న వీడియో..
PM Kisan: రైతులకు ప్రభుత్వం హెచ్చరిక.. పీఎం కిసాన్ డబ్బులు దొంగిలిస్తున్నారు జాగ్రత్త..?