అంజీర, వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. అంజీర పండ్ల ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల ఆరోగ్యపరంగా అనేక లాభాలున్నాయి. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి.. వీటిని పచ్చిగానూ, డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. అయితే, అంజీర ఆకులతోనూ అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ పండ్లతో పాటు అంజీర ఆకులు కూడా అద్భుత పోషకాల గని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్‌గ్లైకేమియా ,హైపోగ్లైసీమియా ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి, గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు. అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది.
అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. అర చెంచా పొడిని ఒక కప్పు నీళ్లలో కలిపి టీ లాగా తాగాలి. రెండు విధానాలు అపారమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఎముకలు బలహీనంగా ఉంటే అంజీర్ ఆకులను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం లభించి చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందుకోసం అంజీర్ ఆకుల పొడిని ఉపయోగించాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..