AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NailCutter Hack: నెయిల్ కట్టర్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు.. దీని వెనకున్న బిజినెస్ టెక్నిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నెయిల్ కట్టర్ డిజైన్ ను ఎప్పుడైనా గమనించారా.. ట్రెండ్ కు తగ్గట్టుగా ఎన్నో రకాలుగా వీటిని డిజైన్ చేస్తున్నారు. రెండు బ్లేడ్ లాంటి పదునైన వాటితో పాటుగా గోర్లను స్మూత్ గా ఉంచే ఒక స్క్రబర్ ఉంటుంది. అయితే ఎన్ని రకాలుగా వీటి డిజైన్ మారినా ఇందులో చివరగా ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని ఎందుకు వాడుతారా అనే సందేహం మీకు కలిగిందా.. నిజానికి దీన్ని నెయిల్ కట్టర్ పై ఇవ్వడం వెనకు ఒక మల్టీపర్పస్ ఉంది. కానీ చాలా మందికి దీన్ని ఎలా వాడాలో తెలియదు. మరి ఈ చిన్న రంధ్రంతో రోజూ వారి పనులను ఈజీగా ఎలా చేయొచ్చో తెలుసుకోండి..

NailCutter Hack: నెయిల్ కట్టర్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు.. దీని వెనకున్న బిజినెస్ టెక్నిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Nail Cutter Hole Hack
Bhavani
|

Updated on: Mar 07, 2025 | 8:49 PM

Share

మనమందరం గోర్లు కత్తిరించడానికి నెయిల్ కట్టర్ ఉపయోగిస్తాము. కట్టర్ కాకుండా, దీనికి ఒకటి, రెండు లేదా మూడు వేర్వేరు బ్లేడ్‌లు ఉంటాయి, వీటిని మనం గోళ్లను అమర్చడం నుండి గోళ్ల దుమ్మును తొలగించడం వరకు ప్రతిదానికీ ఉపయోగిస్తాము. సాధారణంగా, నెయిల్ కట్టర్ చాలా ఇళ్లలో సులభంగా దొరుకుతుంది. దీనిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అలాగే, మీరు కింద చేసిన రంధ్రం చాలాసార్లు చూసి ఉంటారు. కానీ దానిని పనికిరానిదిగా భావించి, మనం పెద్దగా పట్టించుకోము. కానీ నెయిల్ కట్టర్ చివర ఈ రంధ్రం ఇవ్వడం వెనక ఒక బిజినెస్ టెక్నిక్ కూడా ఉంది. సాధారంణంగా దీని ఉపయోగం మనకు రోజూ ఉండదు. ఎప్పుడో వారానికో పదిరోజులకో ఓసారి గోర్లను ట్రిమ్ చేయడానికి వాడుతుంటాం. మరి ఇంత తక్కువ వాడకం వల్ల వీటి విక్రయాలు ఎలా పెరుగుతాయి? అందుకే దీన్ని పలు రకాల ఇంటి పనుల కోసం కూడా ఉపయోగించేలా డిజైన్ చేస్తుంటారు. అవేంటో చూసేయండి..

ఒంటరిగా వెళ్లేటప్పుడు ఇలా వాడండి..

నెయిల్ కట్టర్ లో రెండు పదునైన బ్లేడ్స్ ఉంటాయి. వీటిని మీరు ఆపదలో ఉన్నప్పుడు వాడుకోవచ్చు. వీటిని కొనేటప్పుడే మంచి క్వాలిటీ ఉన్నవి ఎంచుకుంటే ఇంటికి దూరంగా ఉన్నప్పుడు.. ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీటిని వెంట తీసుకెళ్లండి. మీ దగ్గరున్న కీ చైన్ కి బదులుగా ఆడవారైతే ఈ రంధ్రానికి తాళం చెవులను తగిలించుకుని కీ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. దీన్ని అత్యవసర పరిస్థితులలో ఎదుటివారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు చిన్నపాటి ఆయుధంగా ఉపయోగపడుతుంది.

చేతికి శ్రమలేకుండా..

ఈ రంధ్రాన్ని మీరు కొన్ని వైర్లను వంచడానికి కూడా వాడుకోవచ్చు. ఈ చిన్నపాటి హోల్ మీకు అల్యూమినియం తీగలను వంచడానికి తేలికగా ఉపయోగపడుతుంది. దీని సాయంతో మీకు నచ్చిన ఆకారంలో తీగలను వచ్చవచ్చు. చేతికి పనిలేకుండా దీన్ని ఉపయోగించవచ్చు.

ఇలా కూడా వాడుకోవచ్చు..

ఇప్పుడంటే మస్కిటో రిపల్లెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కొంతకాలం కింద మస్కిటో కాయిల్స్ ను ఎక్కువగా వాడేవారు. అయితే వీటికి సంబంధించిన స్టాండ్లు అన్ని సార్లు ఉండకపోవచ్చు. అప్పుడు వీటిని నెయిల్ కట్టర్ భాగాలను తెరచి బ్లేడ్ లను నిటారుగా పైకి తెరచి మస్కిటో కాయిల్ ను ఆ పదునైన భాగానికి తగిలించాలి. ఈ బరువును బ్యాలెన్స్ చేయడానికి ఈ రంధ్రం ఉపయోగపడుతుంది.

ఒక్కో నెయిల్ కట్టర్ బ్రాండ్ ఒక్కో విధంగా దీని సైజు, ఆకారాన్ని ఇస్తుంటాయి. వీటిని పలు రకాల మేకులను తొలగించేప్పుడు చేతులకు గాయాలు కాకుండా ఉండేందుకు వాడుకోవచ్చు. ఈ చిన్న రంధ్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు దీని గురించి ఆశ్చర్యపోతున్నారు. దీని నిజమైన ఉపయోగం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు గోర్లు కత్తిరించడానికి మాత్రమే కాకుండా అనేక ఇంటి పనులను సులభతరం చేయడానికి కూడా నెయిల్ కట్టర్‌ను ఉపయోగిస్తున్నారు.