ప్రస్తుత కాలంలో చాలా మందిని బాధించే సమస్యల్లో అల్సర్ ప్రాబ్లమ్ కూడా ఒకటి. ఆహారపు అలవాట్లు మారడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువై పోతున్నాయి. గ్యాస్, అల్సర్లు, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తున్నాయి. అల్సర్ వచ్చిందంటే ఏం తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం తిన్నా కడుపులో మంటగానే ఉంటుంది. ఏం తింటే ఎలా జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు. జీర్ణ వ్యవస్థలో నిర్ణీత పరిమాణంలో యాసిడ్ అవసరం. ఇది ఎక్కువైనా.. తక్కువైనా అల్సర్లుగా మారుతాయి. అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా అల్సర్లు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలి. అల్సర్ వచ్చిన వాళ్లు ఎప్పుడూ ట్యాబ్లెట్లు వాడుతూ ఉండాలి. కానీ ఇప్పుడు చెప్పే వాటితో ఈ అల్సర్లు తగ్గించుకోవచ్చు.
కడుపులో మంట, ఛాతీలో నొప్పి, పుల్లటి తేనుపులు, మలబద్ధకం, తలనొప్పిచ జ్వరం, రక్త వాంతులు, రక్త విరేచనాలు, నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం, కడుపులో ఉబ్బరం, రక్త హీనత, బరువు తగ్గిపోవడం, అలసటగా ఉండటం.
అల్సర్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ ఒక గ్లాస్ క్యాబేజీ జ్యూస్ తాగితే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. క్యాబేజీ అల్సర్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
తేనెతో కూడా అల్సర్లు తగ్గించుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. తేనె.. అల్సర్‌తో పోరాడి తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటే అల్సర్ తగ్గుతుంది.
వెల్లుల్లితో కూడా కడుపులో అల్సర్ సమస్యను తగ్గించవచ్చు. వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి ఉన్నాయి. ఇవి అల్సర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ప్రతి రోజూ మీ డైట్‌లో ఒక వెల్లుల్లి ఉండేలా చూసుకోండి.
పసుపుతో కూడా అల్సర్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అల్సర్‌ను తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)