రాత్రిళ్లు లైట్ ఆఫ్ చేసి ఫోన్ చూస్తున్నారా..! అయితే మీ సామర్థ్యం దెబ్బతిన్నట్లే.. ఎలాగో తెలుసుకోండి..

|

May 15, 2021 | 4:57 PM

Smartphone Use Before Sleep : స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఉదయం నిద్రలేవడంతో ప్రజలు

రాత్రిళ్లు లైట్ ఆఫ్ చేసి ఫోన్ చూస్తున్నారా..! అయితే మీ సామర్థ్యం దెబ్బతిన్నట్లే.. ఎలాగో తెలుసుకోండి..
Smartphone
Follow us on

Smartphone Use Before Sleep : స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఉదయం నిద్రలేవడంతో ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లను చూస్తారు. రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్‌తో గంటలు గంటలు గడుపుతారు. అయితే మీ అనేక పనులను సులభతరం చేసే స్మార్ట్‌ఫోన్ మీ ఆరోగ్యంపై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. రాత్రి నిద్రపోయే ముందు లైట్ ఆఫ్ చేసి ఫోన్‌ను ఎక్కువసేపు చూసేవారికి ఇది హానికరం.రాత్రి సమయంలో స్మార్ట్‌ఫోన్ వాడకం మీ నిద్రను బాగా ప్రభావితం చేస్తుందని ఒక నివేదిక వెల్లడించింది. అటువంటి పరిస్థితిలో మీ స్మార్ట్‌ఫోన్ మీ నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందో దాని ప్రతికూలతలు ఏమిటో తెలుసుకోండి.

డాక్టర్ల నివేదిక ప్రకారం.. ఇద్దరు కవలలపై నిర్వహించిన పరిశోధనలో చాలా ముఖ్యమైన సమాచారం వెల్లడైంది. ఇందులో ఒక సోదరి ప్రతి రాత్రి ఒక పుస్తకం చదువుతుండగా, మరొక సోదరి ఫోన్ లేదా టాబ్లెట్ ఉపయోగించిన తర్వాత నిద్రిస్తుంది. ఇద్దరి నిద్రను కొలవడానికి ట్రాకర్‌ను ఉపయోగించారు. ఇందులో ఫోన్ వాడే సోదరికి తక్కువ నిద్ర ఉందని తెలుస్తుంది. పుస్తకం చదివే సోదరికి ఎక్కువ నిద్ర వస్తుంది. రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రీన్‌ను చూడటం వల్ల నిద్రపై ప్రభావం పడుతుందని తేలింది.

సెల్‌ఫోన్‌ లైట్లు చాలా చిన్నవి, వాటిని కళ్ళతో చూసినప్పుడు అవి హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఇది నిద్ర, మేల్కొనే దినచర్యకు భంగం కలిగిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇది నిద్ర వ్యవధిని గణనీయంగా తగ్గిస్తుంది. రాత్రి మంచి నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట ఏకాగ్రత సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను చూడటం మీకు అలవాటు ఉంటే, మీరు సెట్టింగులను మార్చవచ్చు. కాంతిని తగ్గించవచ్చు ఇది కాకుండా నీలిరంగు కాంతికి బదులుగా ఎరుపు రంగులో సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

ప్రకృతి వైపరీత్యం, కేరళలో తౌక్తే తుపాను బీభత్సం, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, గ్రామాలు జల దిగ్బంధం

Cyclone Tauktae Tracker and Updates: కేరళను కమ్మేసిన తౌక్తా.. భారీగా కురుస్తున్న వర్షాలు… రంగంలోకి దిగిన NDRF బృందాలు..

Coronavirus: కరోనా సోకిన వారికి రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు?