Skin Care Tips: మొటిమలు, తామర, సొరియాసిస్ మొదలైన అనేక చర్మ సమస్యలకు కాలుష్యం కూడా కారణం కావచ్చు. దీనివల్ల చిన్నవయసులోనే చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. అంతేకాకుండా చలికాలంలో పొడి గాలి కారణంగా చర్మం నిస్తేజంగా మారుతుంది. ఈ పరిస్థితిలో మీరు మెరిసే చర్మం కోసం ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగిస్తే మంచిది. అయితే మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ కొంత సమయం వరకే పనిచేస్తాయి. అందుకే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మీరు ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. ఇవి మీరు కోల్పోయిన చర్మం కాంతిని తిరిగి తీసుకువస్తాయి.
1. వెన్న, ఆలివ్ నూనె
ఆలివ్ ఆయిల్, వెన్న చర్మానికి సహజసిద్దమైన పోషణను అందిస్తాయి. ఈ రెండిటి ప్యాక్ చర్మంలోని అధిక మురికిని తొలగిస్తుంది. ఒక టీస్పూన్ కోకో బటర్, ఆలివ్ ఆయిల్, అర టీస్పూన్ అల్లంరసం కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని మీ చర్మంపై, ముఖం, మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చక్కటి ఫలితాలు ఉంటాయి.
2. అరటి, పాలు
పాలు, అరటిపండు మిశ్రమం చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో అరటిపండు గుజ్జు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాలు ఉంటాయి.
3. అలోవెరా, ఆల్మండ్ ఆయిల్
8-10 చుక్కల బాదం నూనె లేదా నువ్వుల నూనె, ఒక టీస్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. దానిని పేస్ట్‌లా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి. కనీసం 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ముఖం కడుక్కోండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.
4. బొప్పాయి, పచ్చిపాలు
బొప్పాయిలో చర్మాన్ని మృదువుగా చేసే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పాలలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది పొడి, నిర్జీవ చర్మానికి తేమను అందిస్తుంది. ఇందుకోసం సగం పండిన బొప్పాయిని ముక్కలుగా చేసి పచ్చి పాలను తీసుకోవాలి. బొప్పాయిని మెత్తగా చేసి దానికి పచ్చి పాలు కలపండి. ఈ ప్యాక్‌ని మీ ముఖం, మెడకు అప్లై చేసి ఆరిపోయే వరకు ఉంచి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖం మెరిసిపోతుంది.