Workout Tips: వర్క్ అవుట్‏ను స్కిప్ చేస్తున్నారా ? అయితే ఈ సింపుల్ ట్రిక్స్‏తో ఫిట్‏నెస్‏ను పెంచుకోండిలా..

|

Feb 24, 2021 | 2:07 PM

రోజూ వారీ వ్యాయమం చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారా? ప్రస్తుతం పరిస్థితుల పరిస్థితులలో చాలా మంది వర్క్ అవుట్ చేయడానికి చాలా తక్కువ

Workout Tips: వర్క్ అవుట్‏ను స్కిప్ చేస్తున్నారా ? అయితే ఈ సింపుల్ ట్రిక్స్‏తో ఫిట్‏నెస్‏ను పెంచుకోండిలా..
Follow us on

రోజూ వారీ వ్యాయమం చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారా? ప్రస్తుతం పరిస్థితుల పరిస్థితులలో చాలా మంది వర్క్ అవుట్ చేయడానికి చాలా తక్కువ సమయంలోనే చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా తన ఇన్ స్టాలో కేవలం 15 నిమిషాల్లో వర్క్ అవుట్ చేసే వీడియోను షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన వీడియోలో 15 నిమిషాల డంబెల్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్‌ఐఐటి) వ్యాయామం చేస్తూ కనిపించింది.

ఈ వ్యాయామం చేయడానికి కావాల్సిందల్లా డంబెల్స్ ఒక షీట్. ఒకవేళ డంబెల్స్ లేనివారు బాటిల్స్ లేదా మిల్క్ కార్టన్లను బరువుగా ఉపయోగించవచ్చు. HIIT వర్కౌట్స్ అంటే అధిక తీవ్రత వ్యాయామాలతో సహా స్వల్పకాలిక వర్కౌట్స్. ఈ వ్యాయామం చేయడం వలన తక్కువ సమయంలోనే అత్యథిక కేలరీలను తగ్గించుకోవచ్చు. ఒక పూర్తి గంట (లేదా అంతకంటే ఎక్కువ) వ్యాయామం కోసం కేటాయించడానికి వీలు లేనివారికి ఈ HIIT వ్యాయామం చాలా సహయపడుతుంది. ఈ వర్క్ అవుట్ బరువు తగ్గడానికి మరియు మంచి బలంగా మారడానికి తొడ్పడుతుంది. మీరు ఎంచుకున్న వర్కౌట్ల రకాన్ని బట్టి, ఎముకల నిర్మాణానికి కూడా HIIT వర్కౌట్స్ సహాయపడతాయి. కరాచీవాలా తన ఇన్‌స్టాలో HIIT వ్యాయామంలో భాగంగా ఐదు వ్యాయామాలను గురించి పోస్ట్ చేసింది. అన్ని వ్యాయామాలు ఒక్కొక్కటి 45 సెకన్ల పాటు చేయవలసి ఉంటుంది. ఒక్కోదాని మధ్యలో కనీసం 15 సెకన్ల బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఉపిరి తీసుకునేందుకు వీలవుతుంది. ప్రతి వ్యాయామం గురించి ఆ వీడియో సుదీర్ఘంగా వివరించింది. వ్యాయామం చేయడం వలన బలంగా మారడంతోపాటు.. కీళ్ళ సమస్యలను దూరం చేసేందుకు HIIT వ్యాయామం మరింత సహయపడుతుంది. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా 15 నిమిషాలు టైమర్ సెట్ చేసుకోవాలి. ఆ నిర్ణీత సమయంలో ఎన్ని రౌండ్లు చేస్తూన్నామనేది చూస్తూండాలి.

Also Read:

కొత్తిమీర వంటల్లో రుచికే కాదు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. కీళ్ళ సమస్యలను దూరం చేసే..