Hiccups: ఎక్కిళ్లు అస్సలు తగ్గడం లేదా.. ఈ ట్రిక్స్ ట్రై చేసి చూడండి..

ఎక్కిళ్లు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. ఎక్కిళ్లు అనేవి సడెన్‌గా వస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఎక్కిళ్లు వస్తే అస్సలు తగ్గవు. రోజంతా అలా వస్తూనే ఉంటాయి. ఈ సమస్యను ఎప్పుడో ఒకసారైనా ఫేస్ చేసి ఉంటారు. చిన్న పిల్లల్లో కూడా ఎక్కిళ్లు వస్తూ ఉంటాయి. తినకూడని ఆహారాలు తిన్నప్పుడు, పానీయాలు తాగినప్పుడు ఈ ఎక్కిళ్లు వస్తాయి. ఇదే సమస్య తరచూ వస్తే మాత్రం.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని..

Hiccups: ఎక్కిళ్లు అస్సలు తగ్గడం లేదా.. ఈ ట్రిక్స్ ట్రై చేసి చూడండి..
Hiccups
Follow us

|

Updated on: May 01, 2024 | 1:21 PM

ఎక్కిళ్లు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. ఎక్కిళ్లు అనేవి సడెన్‌గా వస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఎక్కిళ్లు వస్తే అస్సలు తగ్గవు. రోజంతా అలా వస్తూనే ఉంటాయి. ఈ సమస్యను ఎప్పుడో ఒకసారైనా ఫేస్ చేసి ఉంటారు. చిన్న పిల్లల్లో కూడా ఎక్కిళ్లు వస్తూ ఉంటాయి. తినకూడని ఆహారాలు తిన్నప్పుడు, పానీయాలు తాగినప్పుడు ఈ ఎక్కిళ్లు వస్తాయి. ఇదే సమస్య తరచూ వస్తే మాత్రం.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు కొంత మందిలోనే వస్తూ ఉంటాయి. కాబట్టి తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధ పడేవారు తప్పకుండా వైద్య నిపుణులు సలహా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎక్కిళ్లు అస్సలు తగ్గని వారు కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో అయితే ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఎక్కిళ్ల నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నీటిని తీసుకోండి:

ఎక్కిళ్లు వచ్చే సమయంలో చాలా మంది శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా తాగడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి శుభ్రమైన నీటిని ఎక్కువగా తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. నీటిని తాగుతున్నా కూడా మీకు ఈ సమస్య తగ్గక పోతే.. ఒకటే సారి రెండు పెద్ద గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది.

బెల్లం తినండి:

ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నప్పుడు బెల్లం తినడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. బెల్లం ఉండే కొన్ని గుణాల వల్ల ఎక్కిళ్ల సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అలాగే బెల్లం నీటిని తాగినా కూడా ఎక్కిళ్ల సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ముక్కును మూసుకోండి:

ఎంతసేపు అయినా ఎక్కిళ్లు తగ్గకపోతే.. ఈ చిట్కాను ట్రై చేయండి. కాసేపు మీ ముక్కుని మూసి.. నోటి నుంచి గాలిని పీల్చండి. ఇలా చేయడం వల్ల సులభంగా ఎక్కిళ్లు తగ్గుతాయి.

వ్యాయామాలు:

కొందరికి రోజంతా కూడా ఎక్కిళ్లు అనేవి అస్సలు తగ్గవు.. వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారు ప్రతి రోజూ ఉదయం పూట సూర్య నమస్కారాలతో పాటు చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేయడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల కూడా ఎక్కిళ్లు అనేవి ఎక్కువగా రావు.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
టార్గెట్ '29'.. ఐపీఎల్ చరిత్రలోనే కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
టార్గెట్ '29'.. ఐపీఎల్ చరిత్రలోనే కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!