21 May 2024
TV9 Telugu
Pic credit - getty
విటమిన్ B6 శరీరానికి అవసరమైన పోషకం. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
శరీరంలో విటమిన్ బి6 లోపం వల్ల బలహీనత, ఒత్తిడి, శక్తి లేకపోవడం, తరచుగా అనారోగ్యానికి గురికావడం వంటి సమస్యలు వస్తాయి.
శరీరంలో విటమిన్ బి6 లోపం వల్ల అలసట, నిద్రలేమి , చర్మంపై దురద లేదా పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.
విటమిన్ B6 లోపాన్ని తీర్చడం చాలా ముఖ్యం. దీని లోపాన్ని భర్తీ చేయడానికి తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి
అరటిపండులో విటమిన్ బి6 , పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. రోజూ 2 అరటిపండ్లు తినడం ద్వారా, శరీరంలో ఈ విటమిన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు.
కాల్షియంతో పాటు విటమిన్ బి6 కూడా పాలలో మంచి పరిమాణంలో ఉంటుంది. ఈ విటమిన్ లోపంతో బాధపడేవారు తప్పనిసరిగా పాలను ఆహారంలో చేర్చుకోవాలి.
ఖర్జూరం తినడం వల్ల శరీరంలో విటమిన్ బి6 లోపాన్ని భర్తీ చేయవచ్చు. ఇందులో విటమిన్ బి6 అధిక మొత్తంలో ఉంటుంది. ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి.