కంటి నిండా నిద్ర కావాలా.. అయితే ఇలా చేయండి

Jyothi Gadda

21 May 2024

చెర్రీలు చాలా చిన్న సైజులో ఉంటాయి. కానీ ఈ పండులో కళ్లు చెదిరే పోషకవిలువలు ఉంటాయి. అయితే చెర్రీలు రెండు రకాల రుచుల్లో ఉంటాయి. ఒకటి తియ్యనిది. రెండోది టార్ట్ చెర్రీ. భారతదేశంలో సాధారణంగా తీపి చెర్రీలే ఉంటాయి. 

టార్ట్ చెర్రీ పుల్లగా ఉంటుంది. చెర్రీ పండులో ఫైబర్, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టార్ట్‌ చెర్రీలు తినడం ద్వారా మెలటోనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. టార్ట్‌ చెర్రీ జ్యూస్‌ తాగినా గుణం కనిపిస్తుంది. 

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. రోజూ గుప్పెడు చెర్రీలను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.

నిద్రలేమి గుండెకు సంబంధించిన సమస్యలకు, డిప్రెషన్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమి మీ లైఫ్ టైం ని కూడా తగ్గిస్తుంది. అయితే చెర్రీలను తినడం వల్ల నిద్రలేమి తగ్గుతుంది. చెర్రీ జ్యూస్ మంచి నిద్రకు సహాయపడుతుంది. 

ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గించడంలో చెర్రీ పండ్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేటరీ సమస్య తీవ్రమైన మంట, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదాన్నిపెంచుతుంది. చెర్రీలను తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ సమస్య తగ్గిపోతుంది.

చెర్రీలు పండ్లు హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం, పాలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండెను రక్షించడానికి ఉపయోగపడతాయి. 

చెర్రీస్ తినడం వల్ల మైగ్రేన్ తో సహా అన్ని రకాల తలనొప్పులు తగ్గిపోతాయి. ఒక అధ్యయనం ప్రకారం.. 24 ఏళ్ల మహిళ మైగ్రేన్ తో బాధపడుతుండేది. అయితే ఆమె చెర్రీలను తిన్న తర్వాత  మైగ్రేన్ నొప్పి చాలా తగ్గిందని నివేధికలు వెల్లడిస్తున్నాయి.

 మలబద్ధకం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్య. అయితే ఈ సమస్యకు చెర్రీ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే చెర్రీలల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.