మీ పిల్లలూ అబద్ధాలు చెబుతున్నారా?

May 21, 2024

TV9 Telugu

TV9 Telugu

చదివేది ఏడో తరగతే.. పాకెట్‌మనీనెలా ఖర్చు పెట్టారో అడిగినప్పుడు పిల్లల సమాధానాల్లో మాత్రం నిజాయితీ ఉండదు. అంతేకాదు.. క్లాస్‌లో తాము చేసిన పొరపాట్లను మరొకరిపై చెప్పడం వంటివి తరచూ చూస్తుంటాం

TV9 Telugu

సాధారణంగా పిల్లలు ఇలాంటి అబద్ధాలు చెబుతునే ఉంటారు. కానీ బాల్యం నుంచి నిజాయితీగా ఉండడమెలాగో నేర్పాలంటే పెద్దవాళ్లు కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు

TV9 Telugu

పిల్లలు ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం, తాము తప్పు చేయడంలేదని వాదించడం వంటివి చేస్తున్నారంటే అది తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటూ ఉండొచ్చు. అబద్ధాలు చెప్పే అలవాటు పెద్దవాళ్లకు ఉంటే గనుక పిల్లలు గ్రహించి, దాన్నే అనుసరిస్తారు

TV9 Telugu

తాము నిజం మాట్లాడకుండా పిల్లలను మాత్రం పాటించాలని చెప్పడం మంచిది కాదు. వారిలో మార్పు తేవాలని అనుకోవడం కన్నా ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

TV9 Telugu

ఆ తరవాతే.. పిల్లలకు నేర్పించాలి. ఉన్నదున్నట్లుగా నిజాన్ని మాత్రమే మాట్లాడగలగడం, నిజాయితీగా ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో కథల ద్వారా పిల్లలకు చెప్పాలి

TV9 Telugu

రోజూ కొంత సమయాన్ని పిల్లలతో గడపాలి. వారితో చర్చిస్తూనే వారి ఆలోచనలను పంచుకోవాలి. ఆ రోజు విశేషాలను అడిగి తెలుసుకుంటూనే ఆయా సందర్భాల్లో పిల్లలెలా ప్రవర్తించి ఉంటారో గుర్తించాలి

TV9 Telugu

చుట్టుపక్కలవారితో అనుబంధాన్నెలా కొనసాగిస్తున్నారో తెలుసుకోవాలి. స్నేహితుల ఆలోచనలను అర్థం చేసుకోవడంతోపాటు వారిపట్ల నిజాయితీగా ఉంటే, ఆ బంధాలను కలకాలం నిలుపుకోగలమన్న అవగాహన వారిలో కలిగించాలి

TV9 Telugu

అలాగే పిల్లల ప్రవర్తన ప్రశంసాపూర్వకంగా కనిపిస్తే వెంటనే అభినందించాలి. అసూయ, ద్వేషం వంటివి ప్రదర్శించకుండా మనస్ఫూర్తిగా ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించి అభినందించడం తెలుసుకుని, నిజాయితీగా వ్యవహరిరస్తారు