21 May 2024

ఏంటీ.. కివితో ఇన్ని లాభాలున్నాయా.? 

Narender.Vaitla

కివి పండులో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండి చర్మం పాలిపోకుండా, ముడుతలు పడకుండా కాపాడుతుంది.

అధిక రక్తపోటుతో బాధపడే వారికి కూడా కివీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే పొటాషియం కంటెంట్‌ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కివీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ మెరుగైన జీర్ణ క్రియకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమితో బాధపడుతున్నారా.? అయితే రోజుకో కివీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కివీని తరచూ తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది.

ఇక ఇందులోని విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ కివీ తీసుకుంటే వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది.

ఎముకల ఆరోగ్యానినికి కూడా కివీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందలో పుష్కలంగా లభించే ఫొలేట్‌ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. 

కివీలో పుష్కలంగా లభించే ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజపూ ఒక కివినీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.