Maldives: మాల్దీవులకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ నెలలో వెళ్తే బెస్ట్.. తక్కువ బడ్జెట్‌తో ప్లాన్ చేసుకోండి ఇలా

|

Oct 19, 2023 | 11:59 AM

మీ ప్రయాణం మీ బడ్జెట్‌లోనే ఉండేలా చూసుకుంటూ మాల్దీవుల్లో సందర్శించడానికి కొన్ని విషయాలు  తెలుసుకోవడం ముఖ్యం. మాల్దీవులలో సుమారు 105 ద్వీప రిసార్ట్‌లున్నాయి. మీరు మీ బడ్జెట్ ప్రకారం మీ రిసార్ట్‌ను ఎంచుకోవచ్చు. మాల్దీవులను సందర్శించబోతున్నట్లయితే మాఫుషి ద్వీపాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలుంటాయి.

Maldives: మాల్దీవులకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ నెలలో వెళ్తే బెస్ట్.. తక్కువ బడ్జెట్‌తో ప్లాన్ చేసుకోండి ఇలా
Maldives
Follow us on

అతి చిన్న పర్యాటక ప్రదేశం మాల్దీవులు బీచ్ ప్రేమికులకు, హనీమూన్ కు వెళ్లే జంటలకు బెస్ట్ ఎంపిక. ఇక్కడ అందాలను గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. హిందూ మహా సముద్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న బీచ్‌లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అయితే మాల్దీవులు ఖరీదైన దేశం. దీని కారణంగా చాలా మంది ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ వెళ్తారు. అయితే ఖర్చుని దృష్టిలో పెట్టుకుని మాల్దీవులను సందర్శించలేక పోతే.. ఇప్పుడు మీ కల సాకారం చేసుకునే వీలుంది.

అవును మాల్దీవులకు వెళ్లడానికి అధిక బడ్జెట్ కావాల్సి ఉంది. అందుకనే మాల్దీవులు అందాలు తమని ఎంతగా ఆకట్టుకుంటున్నా.. కొంతమంది తమ ప్లాన్‌లను రద్దు చేసుకుంటారు. అయితే ఈ రోజు మీ బడ్జెట్ కు తగినట్లు ప్లాన్ చేసుకుంటూ ఎటువంటి భారం లేకుండా మాల్దీవుల్లో ప్రయాణించవచ్చు.

మాల్దీవుల్లో ఎక్కడ సందర్శించాలంటే

మీ ప్రయాణం మీ బడ్జెట్‌లోనే ఉండేలా చూసుకుంటూ మాల్దీవుల్లో సందర్శించడానికి కొన్ని విషయాలు  తెలుసుకోవడం ముఖ్యం. మాల్దీవులలో సుమారు 105 ద్వీప రిసార్ట్‌లున్నాయి. మీరు మీ బడ్జెట్ ప్రకారం మీ రిసార్ట్‌ను ఎంచుకోవచ్చు. మాల్దీవులను సందర్శించబోతున్నట్లయితే మాఫుషి ద్వీపాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలుంటాయి. సాహస క్రీడలను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు ఇక్కడ  చౌకైన రిసార్ట్స్ కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఏ సీజన్‌లో వెళ్లాలంటే

మీ బడ్జెట్ లో పర్యటన చేయాలనుకుంటే.. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మాల్దీవులను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు రూ. 13 నుండి 15 వేల ధరతోనే విమానా టికెట్ ను  పొందుతారు. ఢిల్లీ నుంచి మాల్దీవ్ ఎయిర్‌పోర్టుకు విమానంలో ప్రయాణించాలి. ఇక్కడ నుండి మాఫుషికి ఫెర్రీని ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. దీని ఛార్జీ 70 నుండి 100 రూపాయల మధ్య ఉంటుంది.

ఎన్ని రోజుల ప్రయాణం

మాల్దీవులలో గడపడానికి 4 పగలు, 3 రాత్రులు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే పర్యటనను ఎంజాయ్ చేయాలంటే ప్రయాణం చేసే రోజుల్లో శుక్రవారం రాకుండా చూసుకోండి. ఎందుకంటే మాల్దీవుల్లో శుక్రవారం సెలవు.

ప్రత్యేకత ఏమిటంటే

మాఫుషి ద్వీపంలో రూ.4 వేల నుంచి రూ.7 వేల ధరల్లో గదులు రెంట్ కు లభిస్తాయి. ఇక్కడ మీరు అన్ని రకాల సహస క్రీడలను ఎంజాయ్ చేయవచ్చు. అన్ని రకాల రెస్టారెంట్లు, కేఫ్‌లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడి రెస్టారెంట్‌లో తినడానికి ఒక్కో వ్యక్తికి రూ.500 నుంచి 1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..