Travel India: హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా .. ఈ ప్రదేశాల అందం ఎంత చెప్పినా తక్కువే..

|

Dec 03, 2023 | 6:51 PM

శీతాకాలంలో కొందరు దుప్పట్లు వేసుకుని కూర్చోవడానికి ఇష్టపడతారు. మరికొందరు హిల్ స్టేషన్లను సందర్శించాలని కోరుకుంటారు. విపరీతమైన చలిలో హిల్ స్టేషన్‌ను సందర్శించడం వినోదాన్ని ఇస్తుంది. డిసెంబర్ నెల ప్రారంభం కాగానే చాలా మంది తమ ట్రావెల్ లిస్ట్‌ను తయారు చేయడం ప్రారంభిస్తారు. మీరు కూడా డిసెంబర్ నెలలో మంచు కురుస్తున్న ప్రాంతాలను చూడాలనుకుంటే.. దేశంలో బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.. 

Travel India: హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా .. ఈ ప్రదేశాల అందం ఎంత చెప్పినా తక్కువే..
Travel India
Follow us on

శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ప్రజలు హిమపాతాన్ని చూసేందుకు ఆసక్తిని చూపిస్తారు. కొందరు హిల్ స్టేషన్ లో బెస్ట్ ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటారు. ఎవరైనా డిసెంబర్ లో సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే,   శీతాకాలంలో కూడా మీరు ఆస్వాదించగల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అవును శీతాకాలంలో కొందరు దుప్పట్లు వేసుకుని కూర్చోవడానికి ఇష్టపడతారు. మరికొందరు హిల్ స్టేషన్లను సందర్శించాలని కోరుకుంటారు. విపరీతమైన చలిలో హిల్ స్టేషన్‌ను సందర్శించడం వినోదాన్ని ఇస్తుంది. డిసెంబర్ నెల ప్రారంభం కాగానే చాలా మంది తమ ట్రావెల్ లిస్ట్‌ను తయారు చేయడం ప్రారంభిస్తారు. మీరు కూడా డిసెంబర్ నెలలో మంచు కురుస్తున్న ప్రాంతాలను చూడాలనుకుంటే.. దేశంలో బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

గుల్మార్గ్: ఇక్కడ భారీగా మంచు కురుస్తోంది. దీనితో పాటు ఇక్కడ స్కీయింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. ఇది కాశ్మీర్‌లోని చాలా అందమైన, అత్యంత ఇష్టపడే పర్యాటక ప్రదేశం. హిమపాతాన్ని ఇష్టపడే వ్యక్తుల జాబితాలో ఈ ప్రాంతం ఖచ్చితంగా చేర్చబడుతుంది.

లేహ్: డిసెంబర్ నెలలో సందర్శించడానికి చాలా ప్రసిద్ధ ప్రదేశం లేహ్. డిసెంబరులో ఇక్కడికి వెళితే తక్కువ ధరకే టిక్కెట్లు కూడా లభిస్తాయి. అలాగే ఈ సీజన్‌లో ఇక్కడ రద్దీ తక్కువగా ఉండడంతో హోటల్ బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందుగా ఇక్కడ హోటల్‌ను బుక్ చేసుకోవడం ద్వారా మంచి తగ్గింపు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

కనాటల్: ఈ ప్రదేశం కూడా శీతాకాలంలో సందర్శించేందుకు బెస్ట్ ప్లేస్. ఢిల్లీ నుండి ధనౌల్తి మీదుగా కనాటల్ చేరుకోవచ్చు. కనాటల్ వెళ్లే మార్గంలో  డెహ్రాడూన్, రిషికేశ్, చంబా గుండా అందాలను చూడవచ్చు. ఈ ప్రదేశాలు శీతాకాలంలో సందర్శించడానికి పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. మంచి అందమైన ప్లేసెస్ గా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడ కూడా మంచు పడటం చూడవచ్చు.

ఔలి: ఉత్తరాఖండ్‌లోని ఔలి చాలా అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ స్కీయింగ్ వాలుల నుండి శీతాకాలపు ఆటల వరకు ప్రతిదాన్ని ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఆసియాలో అతి పొడవైన కేబుల్ కార్..  మంచుతో పాటు స్కీయింగ్ వంటి అనేక ఆనందాలను ఆస్వాదిస్తారు.  హనీమూన్ కోసం ప్లాన్ చేస్తుంటే, డిసెంబర్ నెలలో ఔలి ఉత్తమ గమ్యస్థానం అని చెప్పవచ్చు.

మంచు కురవడం.. అలా మంచు కురుస్తున్న ప్రదేశాలను చూడడం ఇష్టం అయితే ఏమీ ఆలోచించకుండా, మెక్‌లియోడ్‌గంజ్‌కి విహారయాత్రకు బయలుదేరండి. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ మంచు పర్వతాలను చూడవచ్చు. మీరు పారాగ్లైడింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు.

అయితే కొన్నిసార్లు ఈ ప్రదేశాలలో హిమపాతం చాలా భారీగా ఉంటుంది. రోడ్లు మంచుతో కప్పబడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ట్రెక్కింగ్ , మంచు ముద్దలతో ఆడటం మానుకోవాలి. అంతేకాదు మంచు భారీ కురిసే సమయంలో హోటల్ కి చాలా దూరం వెళ్లవద్దు, సమీపంలోని హిమపాతాన్ని ఆస్వాదించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..