GOA Tour: ఇయర్ ఎండ్‌కి గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా.? రూ. 10 వేలలోపే 4 రోజుల టూర్ ప్యాకేజీ..
మరో ఏడాది ముగిసేందుకు సిద్ధమవుతోంది. ఇయర్ ఎండ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే అందరూ సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా ప్లాన్‌లు చేసుకుంటున్నారు. ఇక ఇయర్ ఎండ్ ప్లాన్స్‌లో టూర్‌లకు..

మరో ఏడాది ముగిసేందుకు సిద్ధమవుతోంది. ఇయర్ ఎండ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే అందరూ సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా ప్లాన్‌లు చేసుకుంటున్నారు. ఇక ఇయర్ ఎండ్ ప్లాన్స్‌లో టూర్‌లకు ఓటేసేవారు చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా గోవాలాంటి ప్రాంతాల్లో ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ అంటే మాములుగా ఉండవు. మరి ఈ ఏడాదికి గోవాలో ముగింపు ఇవ్వాలని మీరూ ప్లాన్ చేస్తున్నారా.? మీ కోసమే తెలంగాణ టూరిజం ఓ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఐదు రోజుల టూర్ ప్యాకేజీని కేవలం రూ. 10,000 లోపు అందిస్తోంది. ఇంతకీ ఈ టూర్ ఎలా సాగుతుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ ఆఫీస్ వద్ద టూరిస్ట్ బస్సు ప్రారంభమవుతుంది. నైట్ డిన్నర్ దారిలోనే ఉంటుంది. రాత్రంతా ప్రయాణం చేసిన అనంతరం ఉదయం 6 గంటలకు గోవా చేరుకుంటారు. పర్యాటకుల్ని హోటల్ బెవాన్ రిసార్ట్‌లో దించుతారు. అనంతరం ష్రెప్ కాగానే గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. నార్త్ గోవా సైట్ సీయింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా మపుసా సిటీ, లార్డ్ బోడ్జేశ్వర్ టెంపులు, అగ్వాడా ఫోర్ట్, బాగా బీచ్, కలన్‌గ్యూట్ బీచ్, వెగేటర్ బీచ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను కవర్ చేస్తారు. రాత్రి మళ్లీ హోటల్‌లో దించేస్తారు.
ఇక మూడో రోజు సౌత్ గోవా సైట్ సీయింగ్‌కు తీసుకెళ్తారు. ఇందులో భాగంగా డోనా పౌలా బీచ్, మిరామర్, ఓల్డ్ గోవా చర్చ్, మంగ్వేషీ ఆలయం, కోల్వా బీచ్, మర్డోల్ బీచ్‌లను కవర్ చేస్తారు. సాయంత్రం పాన్ జిమ్‌లో బోట్ క్రూజ్ ఉంటుంది. అయితే ఇక్కడ పర్యాటకులు బోట్ క్రూజ్‌కు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. రాత్రికి హోటల్లో బస చేస్తారు.
నాలుగో రోజు ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. నాలుగో రోజంతా ప్రయాణం ఉంటుంది. ఐదో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఇక ధర విషయానికొస్తే పెద్దలు ఒక్కరికి రూ. 9,900 కాగా పిల్లలకు ఒక్కరికి రూ. 7,290గా ఉంటుంది. సింగిల్‌గా టూర్‌కి వెళితే రూ. 12,900 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..







