Araku Tour: ఇయర్‌ ఎండ్‌కి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? రూ. 7 వేలలో హైదరాబాద్‌ టూ అరకు ట్రిప్‌.

|

Dec 09, 2022 | 6:42 AM

కొత్త ఏడాదిలోకి ఎంటర్‌ అయ్యే సమయం ఆసన్నమవుతోంది. 2022కి గుడ్‌బై చెప్పేందుకు అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇయర్‌ ఎండ్‌లో టూర్‌లు ప్లాన్‌ చేస్తున్నారు. మీరు కూడా ఈ వింటర్‌లో సుందర ప్రదేశాలను పర్యాటించాలనే ప్లాన్‌లో ఉన్నారా.? మీలాంటి వారి కోసమే తెలంగాణ..

Araku Tour: ఇయర్‌ ఎండ్‌కి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? రూ. 7 వేలలో హైదరాబాద్‌ టూ అరకు ట్రిప్‌.
Hyderabad To Araku Tour
Follow us on

కొత్త ఏడాదిలోకి ఎంటర్‌ అయ్యే సమయం ఆసన్నమవుతోంది. 2022కి గుడ్‌బై చెప్పేందుకు అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇయర్‌ ఎండ్‌లో టూర్‌లు ప్లాన్‌ చేస్తున్నారు. మీరు కూడా ఈ వింటర్‌లో సుందర ప్రదేశాలను పర్యాటించాలనే ప్లాన్‌లో ఉన్నారా.? మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం రూ. 7 వేలలోపే 5 రోజులు టూర్‌కు వెళ్లేలా ప్లాన్‌ చేశారు. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు ప్రయాణం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని పర్యాటక భవన్, 6.30 గంటలకు సీఆర్‌ఓ బషీర్‌బాగ్‌లో పర్యాటకులు బస్సు ఎక్కాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. ప్రైవేటు హాటల్‌లో బస ఏర్పాటు చేస్తారు. ఉదయం అక్కడ ఫ్రెషప్‌ కాగానే విశాఖలోని కొన్ని ప్రాంతాలను చూపిస్తారు. కైలాసగిరి, సింహాచలం, రుషికొండ బీచ్, సబ్‌మెరైన్ మ్యూజియం లాంటివి ఇందులో ఉంటాయి. ఇక రాత్రికి వైజాగ్‌లో హోటల్‌లో బస ఉంటుంది.

తర్వాతి రోజు అంటే మూడో రోజు ఉదయం 6 గంటలకు అరకు బయల్దేరాలి. అరకులో ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు, ధింసా డ్యాన్స్ చూడొచ్చు. రాత్రి అరకులోనే బస ఉంటుంది. నాలుగో రోజు అరకు నుంచి అన్నవరం తీసుకెళ్తారు. అక్కడ ఆలయం సందర్శన పూర్తయిన తర్వాత తిరుగుప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఇక టికెట్‌ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 6,999, పిల్లలకు రూ. 5,599గా ఉంది. అయితే భోజనం, దర్శనం టికెట్లు, బోటింగ్‌, లాండ్రీ ఛార్జీలు ప్యాకేజీలో ఉండవు. హైదరాబాద్‌ టు అరకు ప్యాకేజీ ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టూరిజం సంబంధిత ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..