Cherrapunji Summer Tour: సమ్మర్‌లో రెండు రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్‌ చేయండి..

మన దేశంలో చూడదగ్గ టూరిస్ట్ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అటువంటి ప్రదేశాలలో చిరపుంజి ఒకటి. ఇది ఎంతో మందికి ఫేవరేట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌. ఇక్కడ మేఘాల సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. చిరపుంజీని మేఘాల నిలయం అని కూడా పిలవడానికి కారణం ఇదే. విదేశీ టూరిస్టులు కూడా ఇక్కడి సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఉన్న చిరపుంజీ.. అక్కడి పచ్చని లోయలు, జాలువారే జలపాతాలు, ప్రశాంతమైన..

Cherrapunji Summer Tour: సమ్మర్‌లో రెండు రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్‌ చేయండి..
Cherrapunji Summer Tour
Follow us

|

Updated on: Apr 25, 2024 | 1:10 PM

మన దేశంలో చూడదగ్గ టూరిస్ట్ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అటువంటి ప్రదేశాలలో చిరపుంజి ఒకటి. ఇది ఎంతో మందికి ఫేవరేట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌. ఇక్కడ మేఘాల సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. చిరపుంజీని మేఘాల నిలయం అని కూడా పిలవడానికి కారణం ఇదే. విదేశీ టూరిస్టులు కూడా ఇక్కడి సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఉన్న చిరపుంజీ.. అక్కడి పచ్చని లోయలు, జాలువారే జలపాతాలు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులు అమితంగా ఇష్టపడతారు. అక్కడి ప్రదేశాలు సందర్శించడానికి కనీసం రెండు రోజులు వెచ్చించాలి. తేలికపాటి వర్షంలో జలపాతాల మధ్య గడపడం వల్ల చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. రెండు రోజుల్లో చిరపుంజీకి ఎలా టూర్‌ ప్లాన్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

మొదటి రోజు ఎక్కడికి వెళ్లాలంటే..

మౌసమై గుహ

సాహసాలంటే ఇష్టపడేవారు తప్పకుండా మౌసమై గుహను సందర్శించాలి. ఇది చిరపుంజిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ అన్ని రకాల గుహలు కనిపిస్తాయి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూసిన తర్వాత మంచి అనుభూతిని పొందుతారు.

నోహ్కలికై

మౌసమై గుహ తర్వాత నోహ్కలికై జలపాతానికి వెళ్లవచ్చు. అరగంట డ్రైవింగ్ చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. నోహ్కలికై జలపాతం చిరపుంజిలోని అత్యంత ఫోటోజెనిక్ ప్రదేశాలలో ఒకటి. అలాగే ఇక్కడ అర్వా గుహలను కూడా సందర్శించవచ్చు.

రెండవ రోజు ఏయే ప్రదేశాలు చూడొచ్చంటే..

రూట్ లివింగ్ బ్రిడ్జ్

రూట్ లివింగ్ బ్రిడ్జ్ వంతెన ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. దీన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రదేశం ట్రెక్కింగ్‌కు చాలా ప్రసిద్ధి. సాహసాలను ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ చేస్తుంటారు.

డెంతలెన్ జలపాతాలు

చిరపుంజిలో అనేక అద్భుతమైన జలపాతాలను చూడవచ్చు. డెంతలెన్ జలపాతం పేరు కూడా వాటిల్లో ఉంటుంది. బాటా డెంతలెన్ జలపాతం ఒక అందమైన, ప్రత్యేకమైన స్థలం.

చిరపుంజికి ఎలా చేరుకోవాలంటే..

చిరపుంజికి వెళ్లాలంటే విమానంలో తొలుత గౌహతి విమానాశ్రయానికి వెళ్లాలి. ఇక్కడి నుంచి చిరపుంజికి సుమారు 170 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సు లేదా టాక్సీలో కూడా వెళ్ళవచ్చు. రైలులో కూడా గౌహతికి వెళ్లవచ్చు. అక్కడ నుండి చిరపుంజి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles