TV9 Telugu
03 May 2024
రోజూ రాత్రి బెల్లం తింటే..
రోజు రాత్రి బెల్లం తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఇక బెల్లంను క్రమంతప్పకుండా తీసుకుంటే తరచుగా జలుబు, దగ్గు బారిన పడే వారికి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, కఫం వంటివి దూరమవుతాయి.
చర్మ సౌందర్యానికి కూడా బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ కొంచెం బెల్లం తినడం వల్ల మొటిమలు దూరం అవుతాయి.
బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా బెల్లంను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే సమస్యలు దరిచేరవు.
ఇక ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందే కాస్త బెల్లాన్ని తీసుకుంటే రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దరిచేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నిత్యం అలసట, నీరసంగా ఉన్న వారికి బెల్లం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాంట్ ఎనర్జీ అందించడంలో బెల్లం ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..