వేసవిలో దోమలు ఎందుకు ఎక్కువగా కూడతాయి..? కారణం ఏంటంటే..

04 May 2024

TV9 Telugu

ఎండాకాలంలో దోమలు విపరీతంగానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో బయటకు వచ్చామంటే చాలు తెగ కుట్టేస్తాయి.

ఎండాకాలంలో

ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్ది దోమల బెడత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దోమ కాటు తర్వాత ఎర్రటి దద్దర్లు కనిపిస్తాయి.

దోమలు పెరుగుదల

దోమల శరీర స్వభావం చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చురుకుగా ఉండలేక దాని సంఖ్యను పెంచుకోలేకపోతుంటాయి.

చలికాలంలో

దోమల వృద్ధి చెందడానికి వేసవి కాలం ఉత్తమమైనది. ఉష్ణోగ్రత పెరిగినకొద్ది వాటి పునరుత్పత్తికి మెరుగైన పరిస్థితులు సృష్టించుకుంటాయి.

వేడిలో మరింత వృద్ధి

25 డిగ్రీల సెల్పియస్‌ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలలో ఇవి చురుకుగా ఉంటాయి. అవి 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మారుతాయి.

ఉష్ణోగ్రత తగ్గినప్పుడు

వేసవిలో ఇవి మరింత చురుకుగా ఉంటాయి. వీటికి సంతానోత్పత్తి సమయం. వేసవిలో వీటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇవి ఎక్కువగా కూడతాయి.

వేసవిలో

ఆడ దోమ కుట్టడం చేస్తుంది. ఆడ దోమలు కుట్టేవి.  ఎందుకంటే గుడ్లు పెట్టడానికి ప్రోటీన్‌ అవసరం. ఇది రక్తం నుంచి లభిస్తుంది.

దోమలు ఎందుకు కూడతాయి

కొన్ని సందర్భాల్లో దోమలు ఎక్కువ కూడతాయి. వేడి ఉష్ణోగ్రత, చెమట,కాంతి వాసన పరిస్థితుల్లో దోమలు ఎక్కువ ఆకర్షితులవుతాయి.

వేడి ఉష్ణోగ్రత