Srisailam dam : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. ఏడేళ్ల తర్వాత అద్భుతం

|

Jul 28, 2021 | 7:20 PM

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కొంచెం సేపటి క్రితం పైకి లేపారు. జూలై నెలలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

Srisailam dam : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. ఏడేళ్ల తర్వాత అద్భుతం
Srisailam Project
Follow us on

Srisailam dam Gates : అక్కడికి వెళ్తుంటే అదో అనుభూతి. డ్యాం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తే, ఇక ఆ దృశ్యాల గురించి వర్ణించలేం. అక్కడి నుంచి నీరు విడుదల చేస్తున్నారని తెలిస్తే, జనాలు తండోపతండాలుగా వచ్చి ఆ సుందరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. శ్రీశైలం ఆనకట్ట నుంచి కృష్ణమ్మ పరవళ్లు.. చూడటానికే కనుల విందుగా ఉంటుంది. 885 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు దుంకుతుంటే.. ఆ దృశ్యమే ఓ అద్భుతం. నీళ్లలో నుంచి వచ్చే పాలనురగ కన్నా తెల్లగా ఉంటాయి. ఇది చదువుతుంటే.. వెళ్లి చూడాలనిపిస్తోంది కదా.. ఆ ఘట్టం కొంచెం సేపటి క్రితమే ఆవిష్కృతమైంది. శ్రీశైలం డ్యాం రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సాగర్‌కు విడుదల చేశారు.

జూలై నెలలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఎగువ నుంచి ఉధృతంగా ప్రాజెక్టులోకి నీరు వస్తోన్న తరుణంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రాజెక్టు ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు గేట్లు ఎత్తే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇటు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున శ్రీశైలం డ్యామ్‌కు వరద వస్తోంది. అటు జూరాల నుంచి శ్రీశైల మల్లన్న చెంతకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఈ రెండ్ డ్యామ్‌ల నుంచి సుమారు 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు ప్రవహిస్తోంది. ఇప్పటికే జూరాల, తుంగభద్ర నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.

Read also : Police Deaths : ఉన్నట్టుండి కుప్పకూలిపోతోన్న పోలీస్‌లు, నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఉదంతాలు