Travel Ideas: మీకు తెలుసా.. మన దేశంలోని ఈ ప్రాంతాలను కేవలం రూ. 5వేల కంటే తక్కువ ఖర్చుతో చూడొచ్చు..

మన దేశంలో ఉన్న కొన్ని అందమైన ప్రాంతాలను కేవలం రూ. 5 వేల కంటే తక్కువ బడ్జెట్‏లో చూడొచ్చు. వారాంతంలో ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

Travel Ideas: మీకు తెలుసా.. మన దేశంలోని ఈ ప్రాంతాలను కేవలం రూ. 5వేల కంటే తక్కువ ఖర్చుతో చూడొచ్చు..
Brundavan

Updated on: Sep 18, 2022 | 12:50 PM

ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వారుండరు. స్నేహితులు, కుటుంబంతో కలిసి అనేక ప్రాంతాలను చుట్టేయాలనుకునేవారు చాలా మంది ఉంటారు. అలాగే ఒంటరిగా ప్రయాణించాలనుకుంటారు కొందరు. కానీ ఎవరికైనా కొన్ని అందమైన ప్రదేశాలను.. చారిత్రత్మకమైన ప్రాంతాలను చూడాలంటే కచ్చితంగా డబ్బులు ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలి.. డబ్బు లేకపోవడం వలన చాలా మంది ట్రావెలింగ్ చేయాలని ఉన్నా చేయరు. కానీ మీకు తెలుసా. మన దేశంలో ఉన్న కొన్ని అందమైన ప్రాంతాలను కేవలం రూ. 5 వేల కంటే తక్కువ బడ్జెట్‏లో చూడొచ్చు. వారాంతంలో ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

బృందావనం కేవలం దేవాలయాలను సందర్శించడానికి కేవలం మతపరమైన వ్యక్తులకు మాత్రమే కాదు ఎవరికైనా ఇక్కడకు వెళ్లేందుకు అనుమతి ఉంది. బృందావనం పేరు చరిత్రలోనే ప్రత్యేకం. ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ బస చేయడానికి చాలా తక్కువ ధరలకు హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

అలాగే లాన్స్ డౌన్ ఉత్తరాఖండ్ మైదానంలో ఉంది. ఇది చాలా అందమైన ప్రదేశం. కానీ ఇది ఆర్మీ ప్లేస్ కాబట్టి సాధారణంగా ఇక్కడ జనం ఎక్కువగా ఉండరు. ఈ ప్రదేశం ఢిల్లీ నుండి దాదాపు 250 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బస చేయడానికి రూ. 1000 నుండి రూ. 1500 మధ్య హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

హంపి పేరు చాలా మంది విని ఉంటారు. నిజమే ఈ ప్రదేశం చాలా విభిన్నంగా, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలని కోరుకుంటారు. ఇక్కడ స్వదేశీ ప్రజలతో పాటు చాలా మంది విదేశీ పర్యాటకులను చూస్తారు. ఇక్కడ ఉండేందుకు హోటల్స్, భోజనం కూడా తక్కువ ధరలలో లభిస్తాయి.

వారణాసి.. ఇక్కడ సాయంత్రం గంగా హారతి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడకు అనేక మంది పర్యాటకులు వస్తారు. అలాగే ఇక్కడ రోజుకు రూ.300తో ఇక్కడ బస చేయవచ్చు.