IRCTC Tourism: వేసవి విడిదిగా కులు మనాలీ వెళ్లాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు

|

Mar 30, 2022 | 8:50 AM

IRCTC Tourism: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. చల్లటి ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తారు. మనదేశంలో వేసవి విడిది కేంద్రాలుగా సిమ్లా(Simla), కులు(Kulu), మనాలి(Manali) వంటి ప్రదేశాలు ప్రసిద్ధి..

IRCTC Tourism: వేసవి విడిదిగా కులు మనాలీ వెళ్లాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు
Kullu Manali Shimla Tour
Follow us on

IRCTC Tourism: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. చల్లటి ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తారు. మనదేశంలో వేసవి విడిది కేంద్రాలుగా సిమ్లా(Simla), కులు(Kulu), మనాలి(Manali) వంటి ప్రదేశాలు ప్రసిద్ధి. దీంతో వేసవిలో పర్యటన ప్లాన్ చేసుకునేవారు ఆ ప్రదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో  IRCTC టూరిజం హైదరాబాద్ నుండి సిమ్లా, కులు మనాలి టూర్ వరకు కులు మనాలి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇది 7 రాత్రులు, 8 పగళ్లు ఉన్న టూర్ ప్యాకేజీ. టూర్ ప్యాకేజీని హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీగా IRCTC టూరిజం సంస్థ పర్యాటకుల కోసం తీసుకొచ్చింది. సిమ్లా, కులు మనాలి, చండీగఢ్ వంటి పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయవచ్చు. వేసవిలో చల్లటి ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం IRCTC టూరిజం ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ పర్యటన మే 15న ప్రారంభమై మే 22న ముగుస్తుంది. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎంత? అది ఎలా సాగుతుంది? ఏయే ప్రాంతాలను సందర్శించే వీలుకల్పించనుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎనిమిదిరోజుల టూర్ షెడ్యూల్ డిటైల్స్: IRCTC టూరిజంలో భాగంగా హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీ టూర్ మే 15న హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. మొదటి రోజు ఉదయం 11.10 గంటలకు హైదరాబాద్‌లో ప్లైట్ లో బయలు దేరి.. రి మధ్యాహ్నం 1.45 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. అక్కడి నుంచి సిమ్లాకు బయలుదేరాల్సి ఉంటుంది. అదే రోజు సాయంత్రం మాల్ సందర్శన ఉంటుంది. మొదటి రోజు రాత్రి సిమ్లాలో బస చేయాల్సి ఉంటుంది.

రెండవ రోజు ఉదయం కుఫ్రీ సైట్ సీయింగ్ .. అనంతరం సిమ్లా లోకల్ సందర్శన ఉంటుంది. రెండో రోజు రాత్రి సిమ్లాలో బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం మనాలికి బయలుడేరాల్సి ఉంటుంది. దారిలో కులులో పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. అనంతరం ఆ రోజు రాత్రి మనాలిలో  బస చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగో రోజు మనాలిలో సైట్ సీయింగ్ ఉంటుంది. మనాలిలో రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఐదవ రోజు మనాలి లోకల్ సైట్ సీయింగ్ తో పాటు.. వీలైతే రోహ్‌తంగ్ పాస్ ను సందర్శించే వీలు కల్పిస్తారు. ఐదోరోజు రాత్రి కూడా మనాలిలో రాత్రి బస చేస్తారు.

ఆరో రోజున మనాలి నుంచి చండీగఢ్ వెళ్లాలి. ఆ రోజంతా ప్రయాణం ఉంటుంది. చండీగఢ్‌లో ఆరో రోజు రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఏడో రోజున చండీగఢ్ లోని రాక్ గార్డెన్, సుఖ్నా సరస్సువంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఆరోజు రాత్రి చండీగఢ్‌లో బస చేసి.. ఎనిమిదో రోజు చండీగఢ్ విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.15 గంటలకు విమానంలో బయలుదేరి 6.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

టూర్ ప్యాకేజీ ధర: ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.35,850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.37,950 ,సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.52,200 చెల్లించాలి.

టూర్ ప్యాకేజీలో భాగంగా విమాన టిక్కెట్లు, సిమ్లాలో రెండు రాత్రులు, మనాలిలో మూడు రాత్రులు, చండీగఢ్‌లో రెండు రాత్రులు, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ప్రయాణ భీమా వంటివి ఉంటాయి.

Also Read: Bulldozer Toys: పెళ్లి కానుకగా గృహోపకరణాలతో సహా బుల్‌డోజర్ల బొమ్మ.. సీఎం యోగికి థాంక్స్ చెప్పిన వధువులు

Cooking Oil Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న వంట నూనె ధరలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు!

Ice Cream: వేసవిలో ఐస్‏క్రీంను ఎక్కువగా తినేస్తున్నారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఎందుకంటే..