IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి సూపర్ ప్యాకేజీ.. ఫ్లైట్‌లో జర్నీ, ధర తక్కువే..
డివైన్ కర్నాటక పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఫ్లైట్ జర్నీతో ఉండే ఈ టూర్ హైదరాబాద్ ఇంటర్నేషన్‌లో ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. కర్నాటకలోని పలు ప్రాంతాలను కవర్ చేసే ఈ టూర్ 5 రాత్రులు, 6 రోజులుగా సాగుతుంది...
పర్యాటకులకు ఆకట్టుకుంటూ ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీలను అందులోకి తీసుకొస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రాంతాలను కవర్ అయ్యేలా టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. అయితే కేవలం ట్రైన్ జర్నీకే పరిమితం కాకుండా, ఫ్లైట్ జర్నీలు కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే తీసుకొచ్చిందే డివ్ కర్నాటక టూర్ ప్యాకేజీ. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను కవర్ చేసే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివవారు ఇప్పుడు తెలుసుకుందాం..
డివైన్ కర్నాటక పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఫ్లైట్ జర్నీతో ఉండే ఈ టూర్ హైదరాబాద్ ఇంటర్నేషన్‌లో ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. కర్నాటకలోని పలు ప్రాంతాలను కవర్ చేసే ఈ టూర్ 5 రాత్రులు, 6 రోజులుగా సాగుతుంది. ఏయే రోజు ఏ ప్రాంతాల్లో సందర్శిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
* తొలిరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మంగళూరు చేరుకుంటారు. అక్కడ పలు ప్రాంతాలను సందర్ధించారు. రాత్రి బస మంగళూరులో ఉంటుంది.
* తర్వాతి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కాగానే ఉడిపి వెళ్తారు. అక్కడ మేరీ ఐల్యాండ్, మాల్ప్ బీచ్‌లను సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు.
* మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఉడిపి నుంచి హారనాడుకు వెళ్తారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం శ్రినెగరి టెంపుల్ దర్శనం చేసుకొని సాయంత్రం తిరిగి ఉడిపి చేరుకుంటారు. రాత్రి ఉడిపిలోనే బస ఉంటుంది.
* నాల్గవ రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఉడిపి నుంచి కోల్లూరు, గోఖర్ణ, మరుడేశ్వర్ సందర్శన ఉంటుంది. రాత్రి మురుడేశ్వర్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.
* ఐదవ రోజు మురుడేశ్వర్‌లో ఆలయాల దర్శనం తర్వాత కుక్కే వెళ్తారు. ఆ రోజు రాత్రి బస అక్కడే ఉంటుంది.
* ఇక చివరి రోజూన 6వ రోజు ఉదుయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం మంగళూరుకు బయలుదేరాల్సి ఉంటుంది. సాయంత్రం మంగూళురు ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్ ఉంటుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
పాక్యేజీ ధరలు ఇలా ఉన్నాయి..
సింగిల్ షేరింగ్ కు రూ.44200, డబుల్ షేరింగ్ కు రూ. 34000, ట్రిపుల్ షేరింగ్ కు రూ.32,500గా నిర్ణయించారు. హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం కథనాల కోసం క్లిక్ చేయండి..