IRCTC: సమ్మర్ హాలీడేస్‌లో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? బెస్ట్ టూర్ ప్యాకేజీలు..
ఇక తిరుమల అనగానే దర్శనం టికెట్‌ల కోసం టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి వారికోసం ఐఆర్‌టీసీ దర్శనం టికెట్‌తో పాటు ప్యాకేజీలను అందిస్తున్నాయి. రైలుతో పాటు విమాన ప్యాకేజీలను కూడా ఐఆర్‌సీటీసీ పలు ప్యాకేజీలను అందిస్తోంది...
సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడిప్పుడే సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తికాగా, టెన్త్ పరీక్షలు పూర్తికానున్నాయి. ఇక పాఠశాలలకు త్వరలోనే సెలవులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సెలవుల్లో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రకరకాల టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.
ఇక తిరుమల అనగానే దర్శనం టికెట్‌ల కోసం టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి వారికోసం ఐఆర్‌టీసీ దర్శనం టికెట్‌తో పాటు ప్యాకేజీలను అందిస్తున్నాయి. రైలుతో పాటు విమాన ప్యాకేజీలను కూడా ఐఆర్‌సీటీసీ పలు ప్యాకేజీలను అందిస్తోంది. మరి హైదరాబాద్ నుంచి తిరుమలకు ఐఆర్‌సీటీసీ అందిస్తోన్న బెస్ట్ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* హైదరాబాద్ నుంచి గోవిందం పేరుతో ఐఆర్‌సీటీసీ ఓ ప్యాకేజీని అందిస్తోంది. రెండు రాత్రులు, మూడు పగళ్లు ఈ టూర్ సాగుతుంది. ప్రతీ రోజూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నెంబర్ 12734 సికింద్రాబాద్, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, గుంటూరు రైల్వే స్టేషన్‌ల ఈ ట్రైన్ ఎక్కొచ్చు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 3800 నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయి.
* ఐఆర్‌సీటీసీ పూర్వ సంధ్య పేరుతో మరో టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూరు ఆలయాలు కవర్ అవుతాయి. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ప్రయాణం ఉంటుంది. ఈ రైలును సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, లింగంపల్లి, గుంటూరు స్టేషన్స్‌లో ఆగుతుంది. ఏప్రిల్ 5 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధరలు రూ.5,660 నుంచి అందుబాటులో ఉన్నాయి.
* తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో ఐఆర్‌సీటీసీ ఎయిర్ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే శ్రీవారిని దర్శించుకొని రావొచ్చు. హైదరాబాద్ నుంచి 6E-2005 విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11,18,25,29 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ ధర రూ. 15వేల నుంచి అందుబాటులో ఉంది.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..