Goa: ‘వర్క్ ఫ్రమ్ బీచ్’ ఇంటింటికి ఫైబర్‌నెట్ సదుపాయం.! వీడియో
అందమైన సముద్ర తీరాలు.. స్నార్కెలింగ్ వంటి సాహసోపేత జలక్రీడలకు గోవా ప్రసిద్ధి. దేశవిదేశాల నుంచి ఏటా పెద్ద ఎత్తున పర్యటకులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. అయితే.. ఆఫీసు పనుల కారణంగా కొంతమంది ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారినీ రప్పించేందుకు గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘వర్క్ ఫ్రమ్ హోం’ మాదిరి ఇక్కడి బీచ్‌ల నుంచే సందర్శకులు తమ ఆఫీసు..
అందమైన సముద్ర తీరాలు.. స్నార్కెలింగ్ వంటి సాహసోపేత జలక్రీడలకు గోవా ప్రసిద్ధి. దేశవిదేశాల నుంచి ఏటా పెద్ద ఎత్తున పర్యటకులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. అయితే.. ఆఫీసు పనుల కారణంగా కొంతమంది ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారినీ రప్పించేందుకు గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘వర్క్ ఫ్రమ్ హోం’ మాదిరి ఇక్కడి బీచ్‌ల నుంచే సందర్శకులు తమ ఆఫీసు పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజలు గోవాకు రావచ్చు.. విశ్రాంతి తీసుకోవచ్చు.. అదే విధంగా ఆఫీసు పని కూడా చేసుకోవచ్చు. ఈ దిశగా ‘డిజిటల్ నోమాడ్’ విధానం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ప్రతి గ్రామం డిజిటల్‌గా అనుసంధానమై ఉందనీ పనాజీలో ఇంటింటికీ ఫైబర్ నెట్ సదుపాయం త్వరలో పూర్తి కానుందనీ బీచ్ నుంచి పని విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు గోవా సీఎం సావంత్ చెప్పారు. ఈ దిశగా ‘డిజిటల్ నోమాడ్’ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా పర్యాటకులు గోవా నుంచే ఆఫీసు పని చేసుకోవచ్చుననీ దీనికి తగిన వాతావరణం కల్పిస్తామని వివరించారు. స్థానికంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మిరామర్ బీచ్‌లో సముద్ర హారతి ప్రారంభించామనీ ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయనీ అన్నారు. భవిష్యత్తులో గోవా ‘దక్షిణ కాశీ’గా గుర్తింపు పొందుతుందనీ యోగా కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు పెట్టుబడులూ వస్తున్నాయని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

